ప్రభాస్ మూవీ అప్ డేట్స్

Tuesday,March 10,2020 - 12:13 by Z_CLU

ఎట్టకేలకు ప్రభాస్ మూవీకి సంబంధించి అప్ డేట్ ఇచ్చింది యూవీ క్రియేషన్స్. విదేశాల్లో ఓ క్యూట్ ఛేజింగ్ సీన్ తీశామని, యూరోప్ లో త్వరలోనే మరో భారీ షెడ్యూల్ ప్రారంభిస్తామని తెలిపింది. అంతేకాదు.. ఇకపై ప్రభాస్ మూవీకి సంబంధించి రెగ్యులర్ గా అప్ డేట్స్ ఇస్తామని కూడా ప్రామిస్ చేసింది.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ప్రభాస్ మూవీ. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ఒకప్పటి బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఈ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా నటిస్తోంది. ఆమె పాత్ర సినిమాకు హైలెట్ గా ఉంటుందని అంటోంది యూనిట్. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు రాథేశ్యామ్ లేదా ఓ డియర్ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.