అది ఐటెంసాంగ్ కాదు, సెలబ్రేషన్ సాంగ్

Tuesday,March 10,2020 - 12:24 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి ఆచార్య అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ ఉగాదికి టైటిల్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ ను చిరంజీవి-రెజీనా మధ్య ఆల్రెడీ పిక్చరైజ్ చేశారు.

ఇప్పుడీ స్పెషల్ సాంగ్ పై రెజీనా రియాక్ట్ అయింది. చిరంజీవి సినిమాలో తను ఐటెంసాంగ్ చేశానని అంతా అంటున్నారని, కానీ అది ఐటెంసాంగ్ కాదంటోంది రెజీనా. సినిమాలో అది సెలబ్రేషన్ సాంగ్ అని, సినిమా చూసిన తర్వాత అది ఐటెంసాంగ్ కాదనే విషయాన్ని అంతా ఒప్పుకుంటారని చెబుతోంది.

ఐటెంసాంగ్స్ చేయడం తనకు ఇష్టం ఉండదంటోంది రెజీనా. చిరంజీవి సినిమాలో తనది వెరీ వెరీ స్పెషల్ సాంగ్ కావడం వల్లనే చేశానని చెబుతోంది. దయచేసి ఐటెంసాంగ్ ఆఫర్లతో తనను ఎవరూ సంప్రదించవద్దని మేకర్స్ ను కోరుతోంది.

డాన్స్ విషయంలో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చిరంజీవి నంబర్ వన్ అంటోంది రెజీనా. మెగాస్టార్ తో డాన్స్ చేయడం చాలా కష్టమని, ఆయన టైమింగ్ అందుకోవడం ఎవ్వరితరం కాదంటోంది.