జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ : 'సీనయ్య' అప్డేట్స్

Tuesday,March 10,2020 - 11:10 by Z_CLU

స్టార్ డైరెక్టర్ వీ.వీ.వినాయక్ ‘సీనయ్య’ సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే… ఈ మధ్యే గ్రాండ్ గా లాంఛయిన ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలో ఏ మాత్రం నిజం లేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలాఖరున లేదా ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ముందుగా హైదరాబాద్ లో మొదటి షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. శంషాబాద్ దగ్గరలో ఉన్న ఓ కాలనీలో వినాయక్ మిగతా నటులపై కొన్ని సీన్స్ తీస్తారని సమాచారం. ప్రస్తుతం వినాయక్ సరసన నటించబోయే హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు నిర్మాత దిల్ రాజు. మరికొన్ని రోజుల్లో హీరోయిన్ ఎవరనేది ఫైనల్ చేసి రెండో షెడ్యుల్ లో ఆమెపై కొన్ని కీలక సన్నివేశాలు తీసేలా ప్లానింగ్ జరుగుతుంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు నరసింహ రావు దర్శకుడు.