బాక్సాఫీస్‌ బాహుబలికి బర్త్ డే విషెష్

Tuesday,October 23,2018 - 11:15 by Z_CLU

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు నటవారసుడుగా పరిచయమయ్యాడు ప్రభాస్‌. ‘హీరో అంటే ఇలా ఉండాల్రా’ అనేలా అందరినీ ఆకట్టుకున్నాడు ఆరడుగుల అజానుబాహుడు. ‘ఈశ్వర్‌’ చిత్రంతో హీరోగా పరిచయమై అనతికాలంలోనే తన నటనతో అందరి మన్ననలు పొందారు.

‘రాఘవేంద్ర’, ‘వర్షం’, ‘అడవిరాముడు’, ‘చక్రం’, ‘ఛత్రపతి’, ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’ ‘బుజ్జిగాడు’ ‘బిల్లా’, ‘ఏక్‌నిరంజన్‌’, ‘డార్లింగ్‌’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘రెబల్‌’, ‘మిర్చి’ వంటి విభిన్నమైన చిత్రాలు చేసి అన్నివర్గాల ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌.

2015లో ‘బాహుబలి ది బిగినింగ్‌’, 2017లో విడుదలైన ‘బాహుబలి 2’తో తిరుగులేని క్రేజ్‌ను తన సొంతం చేసుకున్నాడు ప్రభాస్. తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాగా బాహుబలి కలెక్షన్స్‌ కుంభవృష్టిని కురిపించింది. ఈ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్

ప్రస్తుతం సాహో, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న మరో సినిమాతో బిజీగా ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్. వీటిలో సాహో సినిమా వచ్చే ఏడాది గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ప్రభాస్ కున్న నేషనల్ పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సాహోను విడుదల చేస్తున్నారు. తన కెరీర్ లో మరో బాహుబలి లాంటి సక్సెస్ ను అందుకోవాలని ఆశిస్తూ, యంగ్ రెబల్ స్టార్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది జీ సినిమాలు.