టీజర్ కాదు... ‘సాహో’ మేకింగ్ వీడియో

Tuesday,October 16,2018 - 06:36 by Z_CLU

ఈ నెల 23 న ప్రభాస్ బర్త్ డే. ప్రస్తుతం ఇటలీలో తన కొత్త సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు ప్రభాస్.  అయితే  ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ బర్త్ డే సందర్భంగా బ్లాస్టింగ్ సర్ ప్రైజ్ గా ‘సాహో’ టీజర్ రిలీజవుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే నిజానికి ఆ రోజు టీజర్ రిలీజ్ అవ్వడం లేదు. ఈ సినిమాకి సంబంధించి మేకింగ్ వీడియోని రిలీజ్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.

ఇప్పటి వరకు జస్ట్ ఫిల్మ్ మేకింగ్ పైనే కాన్సంట్రేట్ చేసిన సినిమా యూనిట్, సినిమా ప్రమోషన్స్ ని కూడా చాలా యూనిక్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఏ మాత్రం హడావిడి  చేయకుండా ఫ్యాన్స్ లో క్రియేట్ అయి ఉన్న క్యూరియాసిటీ మరింత ఇంక్రీజ్ అయ్యేలా, ముందుగా మేకింగ్ వీడియో, ఆ తరవాత కరెక్ట్ టైమ్ చూసుకుని టీజర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ నటిస్తుంది. UV క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుజిత్ డైరెక్టర్. శంకర్-ఎహసాన్-లాయ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.