Prabhas birthday special
ఇండస్ట్రీలో డార్లింగ్ అనే పదం వినగానే టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఈశ్వర్ తో హీరోగా పరిచయమైన ప్రభాస్ ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఎదుగుతూ వచ్చాడు. ‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ కొట్టి కెరీర్ పీక్స్ లో ఉన్న ప్రభాస్ బాహుబలి ఫ్రాంచైజీ కోసం ఐదేళ్ళు కేటాయించి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎవరూ అందుకోలేని ఓ స్టార్డం సంపాదించుకున్నాడు. బాహుబలి ఫ్రాంచైజీ క్రెడిట్ లో ఎక్కువ భాగం రాజమౌళి కే చెందినా తన నటన , రాజసం తో మెస్మరైజ్ చేసి ఆ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు ప్రభాస్. ఆ సినిమా తర్వాత హిస్టారికల్ , ఫిక్షనల్ డ్రామాలు చేయాలంటే అందరికీ ఓ రిఫరెన్స్ లా నిలిచాడు.

వర్షంతో మొదటి బ్లాక్ బస్టర్ , చత్రపతితో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ కి మధ్యలో కొన్ని స్పీడ్ బ్రేకర్స్ తగిలినా అవి పట్టించుకోకుండా ముందుకు సాగుతూ దూసుకెళ్తున్నాడు. డార్లింగ్ , మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లో లవర్ బాయ్ గా కనిపించి అమ్మాయిలకు కలల రాజకుమారుడయ్యాడు. ఈశ్వర్ నుండి రాధేశ్యామ్ వరకు చేసిన ప్రతీ పాత్రలో ఒదిగిపోయాడు డార్లింగ్. బాహుబలి తో యూనివర్సల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలతో చెక్కుచెదరని ఇమేజ్ తో ముందుకెళ్తున్నాడు. తాజాగా కృష్ణం రాజు మరణం ప్రభాస్ కి తీరని లోటుని మిగిల్చింది. పెదనాన్న పెద్ద కర్మ ను సొంత ఊరు మొగల్తూరులో గ్రాండ్ గా చేసి లక్షల మంది అభిమానులకు భోజనం పెట్టి వారిచేత లవ్ యూ డార్లింగ్ అనిపించుకున్నాడు ప్రభాస్. ఇటివల డిల్లీలో జరిగిన దసరా వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందుకొని రావణ దహనంలో పాల్గొని కథానాయకుడిగా అరుదైన గౌరవం అందుకున్నాడు.
వచ్చే ఏడాది ‘ఆది పురుష్’ , ‘సలార్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ ఈ సినిమాలతో మళ్ళీ విజయడంకా మోగిస్తూ ‘ప్రాజెక్ట్ కే’, ‘స్పిరిట్’ సినిమాలతో మరింత కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలని ఆశిస్తూ డార్లింగ్ ప్రభాస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది జీ సినిమాలు.
– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, ossips, Actress Photos and Special topics