అక్కినేని నాగార్జున పోస్ట‌ల్ స్టాంప్ విడుద‌ల‌

Monday,August 29,2016 - 05:58 by Z_CLU

అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన పోస్టల్‌ స్టాంప్‌ను తపాలా శాఖ విడుదల చేసింది. ఈ సందర్భంగా నాగార్జున ‘నిర్మలా కాన్వెంట్‌’ చిత్రంలో పాడిన పాటను ప్రదర్శించారు. తర్వాత అక్కినేని నాగచైతన్య, అఖిల్‌లు పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మలా కాన్వెంట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ రోషన్‌ సాలూరి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ ”నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా ఆయన పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. శివ, గీతాంజలి, నిన్నేపెళ్ళాడుతా, ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి వంటి సినిమాలతో ట్రెండ్‌సెట్‌ చేశారు. మేం ఈ ఏజ్‌లో చేయాల్సిన పనులను ఆయన చేస్తున్నారు” అన్నారు.
అక్కినేని అఖిల్‌ మాట్లాడుతూ ”రోషన్‌తో చిన్నప్పటి నుండి మంచి పరిచయం ఉంది. ఇప్పుడు తన మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నాన్నగారు పాట పాడటం విశేషం. మా అందరికీ ఆయనే ఇన్‌స్పిరేషన్‌. ఆయన పుట్టినరోజు సందర్భంగా పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. మేం చేయాల్సిన పనులన్నీ ఆయనే చేసేస్తున్నారు” అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆల్‌ ఇండియా నాగార్జున ఫ్యాన్స్‌ ఆంధ్ర అసోసియేషన్‌ అధ్యక్షుడు సర్వేశ్వర్‌రావు, తెలంగాణ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.