Interview -నాగార్జున (బంగార్రాజు)

Thursday,January 13,2022 - 02:30 by Z_CLU

కింగ్ నాగార్జున , యువసామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్ లో కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన ‘బంగార్రాజు‘ సంక్రాంతి కానుకగా రేపే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా గురించి తాజాగా మీడియాతో ముచ్చటించారు నాగార్జున. ఆ విశేషాలు నాగ్ మాటల్లోనే…

పండుగ లాంటి సినిమా 

‘బంగార్రాజు’ సినిమా పండగ సినిమా అని ముందు నుండి చెప్తూనే ఉన్నాం. అది మాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఆ సినిమాని మ్యాచ్ చేసే కంటెంట్ ఇవ్వాలి. బట్ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి మించి ఉండేలా కంటెంట్ ప్లాన్ చేశాం. ఈసారి చిన్న బంగార్రాజు స్పెషల్ గా యాడ్ అయ్యాడు. తన క్యారెక్టర్ డ్రైవ్ అంతా స్పెషల్ గా ఉంటుంది.

చైతూ క్యారెక్టర్ అందుకే పెట్టాం 

ఈ సీక్వెల్ కథ అనుకుంటున్నప్పుడు మళ్ళీ బంగార్రాజు కిందకి రావాలి ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ‘సోగ్గాడే చిన్ని నాయన’ లో తన కొడుకు రాము కి ఏదో ప్రాబ్లం ఉంటే వచ్చాడు. ఆ సినిమాలో ఎండింగ్ లో రాముకి ఒక కొడుకు పుట్టినట్టు చూపించాం. సో అదే లీడ్ తీసుకొని చిన్న బంగార్రాజు క్యారెక్టర్ క్రియేట్ చేశాం. మనవడిని సెట్ చేయడానికి బంగార్రాజు మళ్ళీ కిందకి వస్తాడు. ఇక చైతు నే ఆ రోల్ కి అనుకోవడానికి రీజన్ ఉంది. తండ్రి కొడుకులు , తాత మనవడు అంటే బ్లడ్ రిలేషన్ ఉంటే ఆ స్క్రిప్ట్ బాగా కనెక్ట్ అవుతుంది. క్యారెక్టర్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. సోగ్గాడే సినిమాలో నేను డ్యుయల్ రోల్ చేశాను కాబట్టే అది వర్కౌట్ అయింది. ఈసారి తాత మనవడు అంటే నేను చైతు చేస్తేనే బాగుంటుందని డిసైడ్ అయ్యాం.

సీక్వెల్స్ కి స్కోప్ ఉన్న కథ 

నిజానికి ‘సోగ్గాడే చిన్ని నాయన’ చేసినప్పుడు దానికి సీక్వెల్ చేద్దామనే ఆలోచనే లేదు. కానీ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడం మళ్ళీ బంగార్రాజు చూస్తే బాగుంటుందని అనుకోవడం జరిగింది. నిజానికి బంగార్రాజు ఆత్మతో ఎన్ని సీక్వెల్స్ అయినా తీయొచ్చు. కథలో ఆ స్కోప్ ఉంది. ప్రస్తుతానికైతే ‘బంగార్రాజు’ సీక్వెల్ గురించి ఆలోచన లేదు. సినిమా రిజల్ట్ ని బట్టి సీక్వెల్ గురించి ఆలోచిద్దాం.

అనూప్… మాకు స్పెషల్ 

నిజానికి అనూప్ మా ఫ్యామిలీ సినిమాలకు బెస్ట్ మ్యూజిక్ ఇస్తాడు. తను బయట సినిమాలకు కూడా అంతే డెడికేటెడ్ గా వర్క్ చేస్తాడు. ఫర్స్ట్ ఇష్క్ సాంగ్స్ విని తనని మనం సినిమాకి లాక్ చేసుకున్నాం. మనం కి ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. సోగ్గాడే కి కూడా బెస్ట్ సాంగ్స్ అందించాడు. ఇప్పుడు బంగార్రాజు కి దానికి మించి మ్యూజిక్ ఇచ్చాడు. అందుకే మ్యూజికల్ నైట్ చేశాం. అనూప్ లో నాకు నచ్చే క్వాలిటీ టైం ఇస్తాడు. మ్యూజిక్ విషయంలో మాకంటే ఎక్కువగా ఆలోచిస్తాడు. ఫైనల్ గా అన్నపూర్ణలో ఓ ఫ్యామిలీ మెంబర్ లా ఉంటాడు.

చైతూకి అదొక్కటే చెప్పా

చైతూ చిన్న బంగార్రాజు క్యారెక్టర్ గురించి తనకి ఒక్కటే చెప్పాను. సోగ్గాడే ఎక్కువ సార్లు చూడమన్నాను. ఎందుకంటే నా క్యారెక్టర్ చిన్న బంగార్రాజు లోకి వెళ్ళినప్పుడు ఆ యాస ఆ మాట తీరు అంత మ్యాచ్ చేయాలి. నేను కొన్ని ఆడియో రికార్డ్ చేసి ఇచ్చే వాడిని. నాకంటే కళ్యాణ్ ఎక్కువ ఫాలో అవుతూ చైతూ ని చిన్న బంగార్రాజు గా తీర్చిదిద్దాడు.

పల్లెటూరి క్యారెక్టర్స్ ఇష్టం 

నాకు ఎప్పటి నుండో పల్లెటూరి క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. నాన్న గారి సినిమాలు చూస్తూ అలాంటి పాత్రలు చేయాలనుకున్నాను. లక్కీగా ఈ టైంలో కూడా సోగ్గాడే లాంటి కథ కుదరడం adhi ఇప్పుడు బంగార్రాజు వరకూ కంటిన్యూ అవ్వడం సంతోషంగా ఉంది. ఈ తరహా పాత్రల్లో చిలిపితనం , పల్లెటూరి యాస , కొంటెతనం , పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటాయి.

మాది గోల్డెన్ కాంబినేషన్ 

నాది రమ్య ది బంగారం లాంటి కాంబినేషన్. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. చాలా సినిమాలు కలిసి వర్క్ చేశాం. తనతో వర్క్ చేయడం బాగా ఎంజాయ్ చేస్తుంటాను. తను ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటుంది. లొకేషన్ లో అందరితో చాలా సరదాగా ఉండే యాక్టర్.

పట్టుబట్టి చేసిన సినిమా 

ఈ ఐడియా అనుకున్నప్పుడే ఇది పండగ కోసం తీసే సినిమా సినిమా. సంక్రాంతికే రావాలి అని టార్గెట్ పెట్టుకున్నాకే షూటింగ్ మొదలు పెట్టాం. ఆగస్ట్ 25 న స్టార్ట్ చేశాం. అప్పటి నుండి పండగ కి వస్తున్నాం అంటూ టీం అందరికీ కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. అందరూ హెల్ప్ చేసి సపోర్ట్ చేస్తేనే ఆ రిలీజ్ డేట్ అందుకోగలం అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. లేదు సార్ మీ వెనుక మేమున్నాం అంటూ అందరూ సపోర్ట్ చేసి సినిమాకు వర్క్ చేశారు. ఏ మాత్రం క్వాలిటీ తగ్గకుండా అందరూ బెస్ట్ ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా థాంక్స్ చెప్తున్నాను.

ఈ సినిమా మీద పట్టు వచ్చేసింది 

కళ్యాణ్ కృష్ణ సినిమాను బాగా డీల్ చేశాడు. ఫస్ట్ సినిమా వల్ల దీని బాగా పట్టు వచ్చేసింది. ఇందులో క్యారెక్టర్స్ మీద , సన్నివేశాల మీద మంచి పట్టు సాధించాడు. ముఖ్యంగా తన రైటింగ్ ఈ సినిమాకు ఆ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఇందులో ఒక పాట కూడా రాశాడు. అది ట్రెండింగ్ లో ఉంది. తనతో వర్కింగ్ వెరీ కంఫర్ట్.

పద్యాలు చదివినట్టే 

ఒక సాంగ్ ఉంది బిగినింగ్ లో మీ మాటలు కావాలి అంటే వెళ్లాను. అక్కడికి వెళ్ళాక ట్రై చేయండి మీరు కొన్ని లైన్స్ పాడితే బాగుంటుంది అన్నారు. ట్రై చేస్తే బాగానే ఉందనిపించింది. నిజానికి అది పాడినట్టు కాదు ఏవో పద్యాలు చదివినట్టే అంతే.

అందరూ అనుకుంటారు 

ఈ సినిమాతో చైతూ కొత్తగా కనిపిస్తాడు. సినిమా చూసాక అందరూ తన గురించి మాట్లాడుకుంటారు. కచ్చితంగా ఇంత మాస్ కూడా చేయగలడా అనిపిస్తుంది. యాక్టర్ గా అన్ని జోనర్స్ లో తన మార్క్ ఉండేలా చూసుకుంటున్నాడు.

కృతిలో ఆ క్వాలిటీ బెస్ట్ 

సినిమాలో నాగ లక్ష్మి క్యారెక్టర్ కి కృతి పర్ఫెక్ట్ అనిపించుకుంది. చాలా డెడికేటెడ్ గా వర్క్ చేసింది. ముఖ్యంగా తెలుగు నేర్చుకొని డైలాగ్స్ చెప్పడం తనలో బెస్ట్ క్వాలిటీ అనిపించింది.


Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics