నాగ్ కు చైతు బర్త్ డే గిఫ్ట్ ..

Monday,August 29,2016 - 04:00 by Z_CLU

అక్కినేని నాగ చైతన్య, శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో, దర్శకుడు ‘చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమమ్’.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్ట్ 29 న అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని ‘ ఎవరే’ .. వీడియో సాంగ్ ను సోషల్ మీడియా లో విడుదల చేశారు యూనిట్. ఇటీవలే విడుదలైన ఈ పాట కు మంచి ఆదరణ లభిస్తుందని, సినిమాకు ఈ పాట హైలైట్ గా నిలుస్తుందని , ఇక నాగార్జున గారి సందర్భంగా ఈ పాట ను విడుదల చెయ్యడం సంతోషంగా ఉందని అంటున్నారు యూనిట్ సభ్యులు.