AGENT మంచి స్పై థ్రిల్లర్ - నాగార్జున

Monday,April 24,2023 - 04:29 by Z_CLU

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా వరంగల్ లో ‘ఏజెంట్’ మాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. అగ్ర హీరో అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేష్ ఈ వేడుకలో పాల్గొన్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ… వరంగల్ పోరాటాలకు అడ్డా. వీరత్వానికి ఇంటి పేరు.. వైల్డ్ వరంగల్. మా అందరికీ మీరంటే పిచ్చి. తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా గొప్పవాళ్ళు సినిమాలంటే ప్రేమ చూపిస్తారు.. ఒక కొత్త జోనర్ తో ఒక మంచి సినిమా ఇస్తే దాన్ని బ్లాక్ బస్టర్ చేసి తీరుతారు. ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి గారు అదే కొత్త జోనర్ తో ఒక చక్కటి  సినిమా,  థ్రిల్లింగ్ సినిమా, స్పై సినిమా మీ ముందు పెడుతున్నారు. అందుకే ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను సినిమా చూడలేదు, కథ వినలేదు. కానీ అఖిల్ ఇంట్లో  చెబుతుంటే వినేవాడిని. బ్లాక్ బస్టర్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. సురేందర్ రెడ్డి గారు ఎన్నో బ్లాక్ బస్టర్స్ తీశారు. అలాగే అనిల్ సుంకర గారు ఎక్కడా వెనకడుగు వేయకుండా ఎంతో ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు. మీరు స్టన్నింగ్ విజువల్స్ చూస్తారు. సాక్షి బ్యూటీఫుల్ హీరోయిన్. తనకి చాలా మంచి భవిష్యత్ వుండాలి. సూపర్ స్టార్ మమ్ముట్టి గారు కథ ఓప్పుకున్నారంటే అది మాములుగా వుండదు. ఆయన సినిమా ఒప్పుకున్నారని తెలిసి, ఖచ్చితంగా ఈ సినిమా అఖిల్ కి పెద్ద హిట్ అవుతుందని ఆనందపడ్డాను.  ఇక వైల్డ్ సాలా గురించి మాట్లాడాలి (నవ్వుతూ) వాడి ఎనర్జీ మీరు ఇప్పుడు చుస్తున్నారు, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. పొట్టలో ఉన్నపుడే వాళ్ళ అమ్మని చాలా ఇబ్బంది పెట్టాడు. తనకి ఏడాదిన్నర వున్నప్పుడు రెస్ట్ లెస్ గా పరిగెత్తేవాడు. అంత చిన్నపిల్లలకి అలాంటి ఎనర్జీ వుండటం మేము చూడలేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళితే వీడిలో ఎనర్జీ వుంది, దాన్ని బయటికి లాగాలంటే నేలపై రోజుకో గంట సేపు  పడుకోబెట్టండని చెప్పారు. సురేందర్ రెడ్డి గారు ఆ ఎనర్జీ అంతా తీసి సినిమాలో పెట్టారు. ఈ సినిమా కోసం అఖిల్ పడుతున్న కష్టం కళ్ళారా చూశాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఎందుకు అవుతుందో అంటే .. మా అక్కినేని అభిమానులు. మీరు చూపిస్తున్న ప్రేమ. ప్రతిభ, కష్టం ఉండొచ్చు. కానీ ప్రేక్షకులు, అభిమానులు మా వెనుక లేకపోతే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వదు. మిమ్మల్ని చూస్తుంటే తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనిపిస్తుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, మేయర్ గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, అందరికీ కృతజ్ఞతలు.’’ తెలిపారు

హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ… ఈ వేడుకకు విచ్చేసిన మంత్రిగారికి, మిగతా అతిధులందరికీ కృతజ్ఞతలు. ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు.. ఇక్కడికి వచ్చినందకు థాంక్ యూ నాన్న (నవ్వుతూ). ఏజెంట్ రెండేళ్ళ ప్రయాణం. నేను, సురేందర్ రెడ్డి గారు కలసినప్పుడు ఏదో క్రేజీగా చేసేద్దామనుకున్నాం. క్రేజీగానే చేశాం. ఇంత హైలో పని చేసిన తర్వాత నేను ఏమౌతాననే ప్రశ్న కూడా వుంది. ఏజెంట్ నాకు ధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చింది. అనిల్ సుంకర గారు ఏజెంట్ కి బ్యాక్ బోన్.  ఎంతగానో సపోర్ట్ చేశారు. సాక్షి కి కృతజ్ఞతలు. ఎడిటర్, డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్ టెక్నికల్ టీం అంతా ఒక మ్యాడ్ నెస్ ఇవ్వాలనే కసితో పని చేశాం. మమ్ముట్టి గారు ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోవడం, ఆయనతో కలసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ప్రేక్షకులు, అభిమానుల ప్రేమ, బలం కోసమే నేను పని చేస్తున్నాను. మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాను. ఏప్రిల్ 28న థియేటర్ లో కలుద్దాం. అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.