సినిమా కోసం స్పెషల్ డైట్

Sunday,June 04,2017 - 03:15 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నాడట. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న పవన్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించాలనుకుంటున్నాడట. ఇప్పటి వరకూ చేయని క్యారెక్టర్ కావడంతో ఈ సినిమాలో కాస్త యంగ్ గా కనిపించడం కోసం స్పెషల్ డైట్ తీసుకుంటూ యంగ్ లుక్ తో మెస్మరైజ్ చేయనున్నాడట పవన్.

కెరీర్ స్టార్టింగ్ నుంచి ఫిజిక్ ను అలాగే మైంటైన్ చేస్తూ వస్తున్న పవన్ లేటెస్ట్ గా వచ్చిన కాటంరాయుడు సినిమాలో కాస్త బొద్దుగా కనిపించాడు. అయితే ఆ క్యారెక్టర్ కోసం అప్పట్లో కొంచెం బరువు పెరిగిన పవన్ తాజాగా త్రివిక్రమ్ సినిమా కోసం బరువు తగ్గి యంగ్ లుక్ లో కనిపించనున్నాడట. అత్తారింటికి దారేది లో పవన్ ను డీసెంట్ లుక్ లో చూపించిన త్రివిక్రమ్ ఈ సినిమాలో కూడా అలాగే చూపించి ఎట్రాక్ట్ చేయాలనీ భావిస్తున్నాడట..