రజినీ సినిమాలో మమ్ముట్టీ కీలక పాత్ర ?

Sunday,June 04,2017 - 05:02 by Z_CLU

సూపర్ స్టార్ రజిని కాంత్ లేటెస్ట్ మూవీ ‘కాలా’. ధనుష్ నిర్మాణంలో పా.రంజిత్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమా పై భారీ అంచనాలు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో రజిని సరసన హిమ ఖురేషి హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి పటేల్, సాక్షి అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ముంబాయి బాగ్రాప్ లో రజిని మాఫియా డాన్ నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీ రోల్ లో మమ్ముట్టీ నటించనున్నాడనే వార్త ప్రెజెంట్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఇటీవలే పా.రంజిత్ మమ్ముట్టి ని కలిసి ఈ కీ రోల్ చేయమని అడగగా అందుకు మమ్ముట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే రజినీతో కలిసి మమ్ముట్టి ‘కాలా’ షూటింగ్లో పాల్గొననున్నాడనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. మరి ఈ వార్త కనుక నిజమైతే 25 ఏళ్ల తరువాత ‘దళపతి’ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయినట్టే…