ఆ రెండు సినిమాలతో...

Sunday,June 04,2017 - 01:00 by Z_CLU

ప్రెజెంట్ తెలుగులో రెండు బడా సినిమాలతో టాప్ హీరోయిన్స్ లిస్ట్ చేరిపోయిన కీర్తి సురేష్ ఈ రెండు సినిమాలతో నెక్స్ట్ ఇయర్ భారీ గానే హంగామా చేయబోతుంది. తెలుగులో ఇప్పటి వరకూ ఈ అమ్మడు నటించిన ‘నేను శైలజ’, ‘నేను లోకల్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ గా నిలవడంతో టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ అనే బ్రాండ్ సొంతం చేసుకుంది ఈ భామ.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి మరో వైపు మహా నటి సావిత్రి బయో పిక్ గా తెరకెక్కుతున్న ‘మహానటి’ సినిమాలో సావిత్రిగా నటిస్తుంది. ప్రస్తుతం కీర్తి నటిస్తున్న ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదేకె రిలీజ్ కానున్నాయి. సో ఈ రెండు సినిమాలతో వచ్చే ఏడాది టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ లో సందడి చేసి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తుందన్నమాట కీర్తి …