సినిమా ఒకటే... టైటిల్స్ మాత్రం ఎన్నో..!

Thursday,October 05,2017 - 10:04 by Z_CLU

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.  మరీ ముఖ్యంగా సినిమాకు ఏం పేరు పెట్టారనే ఎలిమెంట్ హైప్ క్రియేట్ చేసింది. మొన్న దసరాకు కూడా టైటిల్ ఎనౌన్స్ చేయకపోవడంతో ఉత్కంఠ ఇంకా పెరిగింది. తాజా సమాచారం ప్రకారం.. పవన్ 25వ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ పెడతారట. ఈ టైటిల్ తో పాటు సోషల్ మీడియాలో తిరుగుతున్న మరికొన్ని టైటిల్స్ ఏంటో చూద్దాం

 

 దేవుడే దిగి వస్తే :   ఈ సినిమా లాంచ్ అయిన తరవాత ఇమ్మీడియట్ గా ఫిలిం నగర్ లో చక్కర్లు కొట్టిన టైటిల్ ‘దేవుడే దిగి వస్తే’. సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్ లో హల్ చల్ చేసిన ఈ టైటిల్ కొన్ని రోజులు డిస్కషన్  తర్వాత మెల్లగా సైడై పోయింది.

 

మాధవుడు : త్రివిక్రమ్ ఏ సినిమా చేసిన హీరో క్యారెక్టర్ ని తెగ ప్రేమిస్తూ తెరకెక్కిస్తాడు. అందునా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబో అంటే ఫ్యాన్స్ లో హై ఎండ్ క్రేజ్ క్రియేట్ అవుతుంది.  సినిమా యూనిట్ మధ్య నిజంగా డిస్కషన్ జరిగిందో లేదో, లేక ఫ్యాన్స్ ఊహించుకున్నారో తెలీదు కానీ, మాధవుడు టైటిల్ కూడా మ్యాగ్జిమం కన్ఫం అయిపోతుందేమో అనిపించేంతగా ఎట్రాక్ట్ చేసింది.

 

ఇంజనీర్ బాబు : పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించబోతున్నాడు. ఏ పాయింట్ చుట్టూ కథ తిరగనుందో ఇంకా కచ్చితంగా బయటికి రాలేదు కానీ, పవర్ స్టార్ గత సినిమాలతో పోలిస్తే క్లాస్ లుక్ లో ఎంటర్ టైన్ చేయబోతున్నాడనేది ఫిక్స్. ఆ బజ్ కు తగ్గట్టే ‘ఇంజనీర్ బాబు’ అనే టైటిల్ కూడా బాగానే చక్కర్లు కొట్టింది.

 

పరదేశ ప్రయాణం : ఇక సినిమా సెట్స్ పైకి వచ్చీ రాగానే పవర్ స్టార్ నెక్స్ట్ సినిమాలో స్పేస్ క్రియేట్ చేసుకున్న టైటిల్ పరదేశ ప్రయాణం. ఈ టైటిల్ కూడా ఎంత ఫాస్ట్ గా రేజ్ అయిందో, అంతే తొందరగా సైలెంట్ జోన్ లో పడిపోయింది.

 

గోకుల కృష్ణుడు: పవన్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి తాజాగా చర్చకొచ్చిన టైటిల్ ఇది. కరెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా ఈ టైటిల్ దే.  ‘ గోకుల కృష్ణుడు’ అనే టైటిల్ చెప్పుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పైగా త్రివిక్రమ్ స్టయిల్ లోనే ఉంది. ప్రస్తుతానికైతే ఎక్కువ ఓట్లు ఈ టైటిల్ కే పడుతున్నాయి.