జాహ్నవి కపూర్ ‘ధడక్’ సెట్స్ పైకి వచ్చేసింది

Friday,December 01,2017 - 11:57 by Z_CLU

జాహ్నవి కపూర్ ‘ధడక్’ మూవీ  సెట్స్ పైకి  వచ్చేసింది.  మరాఠి బ్లాక్ బస్టర్ ‘సైరత్’ కి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాతో జాహ్నవి కపూర్ తో  పాటు, షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కతార్ కూడా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అవుతున్నాడు. రెండు వారాల క్రితం  గ్రాండ్ గా లాంచ్  అయిన ఈ మూవీ,  ప్రస్తుతం  ఉదయ్  పూర్  లో షూటింగ్  జరుపుకుంటుంది సినిమా యూనిట్.

 

 

 

రీసెంట్ గా రిలీజైన ‘ధడక్’ మూవీ స్టిల్స్ తో మ్యాగ్జిమం ఇంప్రెస్ చేసిన జాహ్నవి, ఇషాన్ తో పాటు శ్రీదేవి ఈ మూవీలో తల్లి క్యారెక్టర్ లో కనిపించనుందనే టాక్, శ్రీదేవి ఫ్యాన్స్ లో క్యూరాసిటీ రేజ్ చేస్తున్నా, ‘ధడక్’ టీమ్ మాత్రం ఈ విషయంలో అఫీషియల్ గా రెస్పాండ్ కాలేదు. ఈ సినిమా జూలై 6 ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకుంది. శశాంక్ ఖైతాన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు.