మహేష్ బాబు కొరటాల మూవీ రిలీజ్ డేట్

Tuesday,August 08,2017 - 07:48 by Z_CLU

సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ ఆగస్ట్‌ 11 నుంచి 22 వరకు లక్నోలో జరుగుతుంది. ఆగస్ట్‌ 9 సూపర్‌స్టార్‌ మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ లక్నోలో జరిగే షెడ్యూల్‌కి సంబంధించిన వివరాలు తెలియజేశారు. సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌లతోపాటు ప్రముఖ తారాగణం పాల్గొనే కీలక సన్నివేశాలతోపాటు పీటర్‌ హెయిన్స్‌ సారధ్యంలో ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరిస్తారు. ఈ చిత్రాన్ని జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, నిర్మాత: డి.వి.వి.దానయ్య, దర్శకత్వం: కొరటాల శివ.