గ్రాండ్ గా రిలీజైన వాసుకి

Friday,July 28,2017 - 11:29 by Z_CLU

నయనతార వాసుకి గ్రాండ్ గా రిలీజయింది. అల్టిమేట్ ఇమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కి మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇవాళ తెలుగులో రిలీజయింది. డ్రగ్స్, రేప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందు నుండే ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేసుకుంది.

తనకు జరిగిన అన్యాయానికి రివేంజ్ తీసుకునే అతి సాధారణ మహిళగా నయనతార పర్ఫామెన్స్ ఈ సినిమాకి  బిగ్గెస్ట్ ఎసెట్ గా నిలుస్తుంది. ఇప్పటికే ట్రేలర్, సాంగ్ తో ఇంప్రెస్ చేసిన వాసుకి, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారినే కాదు, ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేస్తుంది. ఈ సినిమా S.K. సాజన్ డైరెక్షన్ లో తెరకెక్కింది.