రామ్ చరణ్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన పవన్ కల్యాణ్

Tuesday,March 27,2018 - 06:23 by Z_CLU

ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు రామ్ చరణ్. చిరంజీవి, సురేఖ, ఉపాసన.. ఇలా చాలామంది చెర్రీకి శుభాకాంక్షలు చెప్పారు. కానీ ఊహించని విధంగా పవన్ కల్యాణ్ నేరుగా ఇంటికొచ్చి మరీ రామ్ చరణ్ కు విషెష్ చెప్పడం అందర్నీ ఎట్రాక్ట్ చేసింది.

అవును.. పొలిటికల్ గా ఫుల్ బిజీగా ఉన్న పవన్ కల్యాణ్, ప్రత్యేకంగా చిరంజీవి ఇంటికి వచ్చారు. రామ్ చరణ్ కు పర్సనల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఊహించని విధంగా కల్యాణ్ బాబాయ్ ఇంటికొచ్చి మరీ విశెష్ చెప్పడంతో చరణ్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు, బాబాయ్ పవన్ తో కలిసి చెర్రీ దిగిన ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్ ఇదే. ఈ ఏడాది చరణ్ పుట్టినరోజులో హైలెట్ కూడా ఇదే.