నాని ప్లేస్ లో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడా..?

Tuesday,March 27,2018 - 05:16 by Z_CLU

ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎవరి సినిమాలు వాళ్లవి. కానీ ఒక సినిమా మాత్రం ఇట్నుంచి అటు వెళ్లింది. నాని చేయాల్సిన ఓ సినిమా తేజూకు షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా?

దర్శకుడు కిషోర్ తిరుమల నానికి అప్పట్లో ఓ కథ చెప్పాడు. నానికి ఆ కథ నచ్చింది. కానీ బిజీ షెడ్యూల్స్, ఆల్రెడీ ఒప్పుకున్న  కమిట్ మెంట్స్ వల్ల కిషోర్ తిరుమలకు నో చెప్పాడట. కట్ చేస్తే.. సాయిథరమ్ తేజ్ తో కిషోర్ తిరుమల ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో నానికి చెప్పిన  కథతోనే తేజూతో కలిసి సెట్స్ పైకి వెళ్తాడట.

ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో తేజూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అయిన వెంటనే కిషోర్ తిరుమల సినిమా ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఇది సెట్స్ పైకి వస్తుంది. లాంఛింగ్ రోజున మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి.