జీ సినిమాలు ( 28th మార్చి )

Tuesday,March 27,2018 - 10:03 by Z_CLU

ఇంగ్లీష్ వింగ్లీష్

నటీనటులు – శ్రీదేవి, ప్రియా ఆనంద్, మెహ్దీ నెబూ, ఆదిల్ హుస్సేన్

మ్యూజిక్  డైరెక్టర్  – అమిత్ త్రివేది

డైరెక్టర్  – గౌరీ షిండే

విడుదల తేదీ – 2012, సెప్టెంబర్ 14

అతిలోకసుందరి శ్రీదేవి  గ్రాండ్ గా  రీఎంట్రీ ఇచ్చిన మూవీ ఇంగ్లిష్ వింగ్లిష్.  అప్పట్లో శ్రీదేవికి ఎంత పేరు ఉండేదో, తిరిగి అంత క్రేజ్ ను ఓవర్ నైట్ లో ఆమెకు తీసుకొచ్చింది ఈ సినిమా. తనలో నటనా పటిమ ఏమాత్రం తగ్గలేదని శ్రీదేవి నిరూపించుకున్న సినిమా ఇది. ఒక సాధారణ గృహిణి విదేశాలకు వెళ్లినప్పుడు, ఇంగ్లిష్ తెలియక ఎలా ఇబ్బందిపడింది.. దాన్నుంచి సక్సెస్ ఫుల్ గా ఎలా బయటపడి.. ఓ స్వతంత్ర మహిళగా ఎదిగిందనేదే ఈ స్టోరీ. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో శ్రీదేవి యాక్టింగ్ టాలెంట్ మనకు కనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్, అజిత్ గెస్ట్ రోల్స్ పోషించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా హిట్ అయింది.

==============================================================================

 

 

 

నవ వసంతం

నటీనటులు : తరుణ్, ప్రియమణి

ఇతర నటీనటులు : ఆకాష్,అంకిత, సునీల్, రోహిత్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు ,ఆహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఏ.రాజ్ కుమార్

డైరెక్టర్ : కె.షాజహాన్

ప్రొడ్యూసర్ : ఆర్.బి.చౌదరి

రిలీజ్ డేట్ : 9 నవంబర్ 2007

తరుణ్, ప్రియమణి హీరో హీరోయిన్స్ గా దర్శకుడు షహజాహాన్ తెరకెక్కించిన ఫామిలీ ఎంటర్టైనర్ సినిమా నవ వసంతం‘. అందమైన లవ్ స్టోరీ తో పాటు స్నేహితుల మధ్య అనుబంధాన్ని చాటి చెప్పే కథ తో  సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా సూపర్ గుడ్ ఫిలిం గా అందరినీ ఆకట్టుకొని అలరిస్తుంది. తరుణ్ ప్రియమణి మధ్య వచ్చే లవ్ సీన్స్తరుణ్, ఆకాష్, రోహిత్, సునీల్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ తో పాటు ఎస్.ఏ. రాజ్ కుమార్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్స్…

==============================================================================

అందాల రాముడు

నటీనటులు : సునీల్, ఆర్తి అగర్వాల్

ఇతర నటీనటులు : ఆకాశ్, వడివుక్కరసి, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, ధర్మవరపు, వేణు మాధవ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్

డైరెక్టర్ : P. లక్ష్మి కుమార్

ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్, పరాస్ జైన్

రిలీజ్ డేట్ : ఆగష్టు 11, 2006

సునీల్ తన కరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా నటించిన చిత్రం అందాల రాముడు. ఈ సినిమా సునీల్ కరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఆర్తి అగర్వాల్ నటన సినిమాకే హైలెట్.

==============================================================================

భీమిలి కబడ్డీ జట్టు

నటీనటులు : నాని, శరణ్య మోహన్
ఇతర నటులు : కిషోర్, ధనరాజ్, వినయ్, సంతోష్, శివ, రమేష్, కృష్ణ, చంటి
మ్యూజిక్ డైరెక్టర్ : V. సెల్వ గణేష్
డైరెక్టర్ : తాతినేని సత్య
నిర్మాత : NV ప్రసాద్, పరాస్ జైన్

తమిళంలో సూపర్ హిట్టయిన ‘వెన్నిల కబడీ కుజు’ సినిమాను భీమిలి కబడ్డీ జట్టు గా తెరకెక్కించారు. వైజాగ్ పరిసర ప్రాంతమైన భీమిలి పరిసర ప్రాంతాల్లో జరిగే సెన్సిటివ్ కథగా తెరకెక్కింది భీమిలి కబడ్డీ జట్టు. సెన్సిటివ్ ప్రేమ కథతో మొదలైన కథే అయినా, తన జట్టును గెలిపించడం కోసం, ఆఖరి శ్వాస వరకు పోరాడే యువకుడి క్యారెక్టర్ లో నాని నటన అద్భుతం.

==============================================================================

 

మున్నా

 నటీనటులు : ప్రభాస్, ఇలియానా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రాహుల్ దేవ్, తనికెళ్ళ భరణి, వేణు మాధవ్, పోసాని కృష్ణ మురళి, వేణు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : వంశీ పైడిపల్లి

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 2, మే  2007

ప్రభాస్, ఇలియానా జంటగా నటించిన పర్ ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మున్నా. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి పీటర్ హెయిన్స్ యాక్షన్, హారిస్ జయరాజ్ సంగీతం హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

 

రాఘవన్ 

నటీనటులు: కమల హాసన్, జ్యోతిక, కమలినీ ముఖర్జీ

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, రాజశ్రీ, డేనియల్ బాలాజీ, బిదూషి దాస్ బార్డే తదితరులు..

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయ రాజ్

డైరెక్టర్: గౌతమ్ మీనన్

ప్రొడ్యూసర్ : మాణిక్యం నారాయణన్

రిలీజ్ డేట్ : 25 ఆగష్టు 2006

గౌతం మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ రాఘవన్. ఇది ఒక సీరియల్ కిల్లర్ నేపథ్యంలో సాగే కథ. ఒకే పద్ధతిలో జరుగుతున్న హత్యల మిస్టరీని చేధించే పోలీసాఫీసర్ గా నటించాడు కమల హాసన్. ప్రకాష్ రాజ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు.