'పైసా వసూల్' స్టంపర్ అదిరింది

Friday,July 28,2017 - 11:57 by Z_CLU

బాలయ్య పైసా వసూల్ ‘స్టంపర్’ అదిరింది. ‘అన్నా.. రెండు బాల్కనీ టికెట్లు కావాలి..’ అంటూ బాలయ్య వాయిస్ తో బిగిన్ అయ్యే స్టంపర్ 1:31 సెకన్ల పాటు కన్నార్పకుండా చేయడమే కాదు, GPS లాంటి హిస్టారికల్ మూవీ తరవాత ఊరమాస్ ఆంగిల్ లో బాలయ్యను పర్ ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది.

సినిమా లాంచ్ టైమ్ లోనే ఈ సినిమాలో బాలయ్య డైలాగ్స్ విషయంలో గ్యారంటీ ఇచ్చిన పూరి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడనే అర్థం అవుతుంది. అల్టిమేట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రియా శరణ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాని దసరా పండక్కి రిలీజ్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.