నాగార్జున సాగర్ లో నాగచైతన్య యుద్ధం

Friday,July 28,2017 - 12:45 by Z_CLU

నాగ చైతన్య ‘యుద్ధం శరణం గచ్చామి’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉన్న సినిమా యూనిట్, నాగార్జున సాగర్ దగ్గరలోని కొత్త బ్రిడ్జి పై ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో నాగ చైతన్య తో పాటు శ్రీకాంత్ కూడా ఉన్నాడు.

కృష్ణ మరిముత్తు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ జూలై 31 న రిలీజ్ కానుంది.