రామ్ సరసన 'నేలటిక్కెట్టు' హీరోయిన్

Wednesday,April 11,2018 - 12:49 by Z_CLU

ప్రస్తుతం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్. ఈ మూవీ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. గరుడవేగ సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చిన ఈ దర్శకుడు.. తన నెక్ట్స్ ప్రాజెక్టు కోసం మళ్లీ ఓ యాక్షన్ సబ్జెక్ట్ నే రాసుకున్నాడు. ఈ యాక్షన్ మూవీలో రామ్ సరసన మాళవిక శర్మను హీరోయిన్ గా తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రవితేజ సరసన నేలటిక్కెట్టు సినిమా చేస్తోంది. ఈమెకిదే తొలి తెలుగు సినిమా. ఇప్పుడు తన సెకెండ్ ప్రాజెక్టును రామ్ తో చేసే ఛాన్స్ ఉంది. అయితే మాళవికకు ఇదే రెండో సినిమా అని చెప్పలేం. ప్రస్తుతం చాలా ప్రొడక్షన్ కంపెనీలు ఈమెతో చర్చలు జరుపుతున్నాయి. సో.. దేనికి ఆమె ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుందనేది అప్పుడే చెప్పలేం.

రవితేజతో ఆమె చేస్తున్న నేలటిక్కెట్టు సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమా హిట్ అయితే మాళవికకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం గ్యారెంటీ.