దీపావళి కానుకగా 'ఒక్కడొచ్చాడు'

Monday,August 29,2016 - 11:04 by Z_CLU

విశాల్ -తమన్నా జంటగా ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. ప్రస్తుతం చిత్రీకరణ లో ఉన్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఆగస్ట్ 29 న విశాల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.

‘పందెంకోడి’, ‘పొగరు’, ‘భరణి’, ‘పూజ’, ‘రాయుడు’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత నా నుండి వస్తున్న మరో మంచి సినిమా ‘ఒక్కడొచ్చాడు’. అని ప్రతి ఊళ్ళోనూ జరిగే అన్యాయాలను అరికట్టడానికి ఎవరో ఒకరు నడుం కట్టాలి. అలా ఈ సినిమాలో ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రశ్నించడానికి, వాళ్ళకి న్యాయం చెయ్యడానికి ‘ఒక్కడొచ్చాడు’ అనేదే ఈ చిత్ర కధాంశం అని ఈ చిత్రం ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందని విశాల్ తన జన్మదిన సందర్భంగా తెలిపారు..
విశాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, పాటలు: డా|| చల్లా భాగ్యలక్ష్మీ, ఎడిటింగ్‌: ఆర్‌.కె.సెల్వ, డాన్స్‌: దినేష్‌, శోభి, సహనిర్మాత: ఇ.కె.ప్రకాష్‌, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్‌.