'ఓం నమో వేంకటేశాయ' ఫస్ట్‌ లుక్‌ విడుదల

Monday,August 29,2016 - 11:21 by Z_CLU

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి వంటి సూపర్ డూపర్ హిట్ భక్తి రస చిత్రాల తరువాత మరో భక్తి రస చిత్రంగా రూపొందుతున్న చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’ సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి అందిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున హాథీరామ్‌ బాబాగా కనిపించనున్నాడు.

ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్‌ నటిస్తుండగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది.
ఆగస్ట్‌ 29 అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా హాథీరామ్‌ బాబా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
ఈ పోస్టర్ అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులనూ బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందిస్తున్న ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్‌.గోపాల్‌రెడ్డి, జె.కె.భారవి, కిరణ్‌కుమార్‌ మన్నె, గౌతంరాజు ఇతర సాంకేతిక వర్గం.