హ్యాపీ బర్త్ డే 'నాగార్జున'

Monday,August 29,2016 - 10:49 by Z_CLU

 

అందం అక్కినేని వారింటి అలంకారం. ఎ.ఎన్.ఆర్ వారసుడిగా తెరంగేట్రం చేసిన నాగార్జున ఆరడుగుల అందగాడిగా అమ్మాయిల కలల సోగ్గాడయ్యాడు.ఈ ‘ఘరానా బుల్లోడు’ వెండి తెర పండగ. ‘శివ’ చిత్రం తో తెలుగు సినిమాకు కొత్త ‘ఊపిరి’ ఊదిన ‘మన్మధుడు’ మన నాగ్. ‘రాజన్న’,’ఢమరుకం’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయడం లోనూ అక్కినేని అందగాడికి సాటి రాగలవారెవ్వరూ లేరనడం అతిశయోక్తి కాదు. కథానాయకులుగా అరంగేట్రం చేసిన తనయులిద్దరికీ గట్టి పోటీనివ్వడం ఒక్క కింగ్ కే సాధ్యమైందని ఆనందంగా చెప్పుకుంటారు అక్కినేని అభిమానులు. ఆగస్టు 29 న అక్కినేని నాగార్జున జన్మదిన సందర్భంగా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది జీ సినిమాలు.