ఏడాది గ్యాప్ ను అలా కవర్ చేయబోతున్నాడు

Tuesday,August 06,2019 - 01:03 by Z_CLU

రాజమౌళి దర్శకత్వంలో ఆర్-ఆర్-ఆర్ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా కంప్లీట్ అయ్యేవరకు మరో సినిమా చేయడానికి వీల్లేదు. సో.. ఈ ఏడాది ఎన్టీఆర్ నుంచి సినిమా లేనట్టే. మరి ఈ గ్యాప్ ను యంగ్ టైగర్ ఎలా కవర్ చేయబోతున్నాడు?

అభిమానులకే కాదు, ఎన్టీఆర్ కు ఇదే ఆలోచన ఉంది. అందుకే ఈ ఏడాది గ్యాప్ ను భర్తీ చేసేలా సినిమాల లైనప్ రెడీ చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యంగ్ టైగర్, అదే ఊపులో త్రివిక్రమ్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను వచ్చే ఏడాది స్టార్ట్ చేస్తాడు ఎన్టీఆర్. అదే టైమ్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ప్రారంభిస్తాడు. ఇలా ఒకేసారి 2 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చి ఈ ఏడాది గ్యాప్ ను కవర్ చేయబోతున్నాడు.

అంటే.. వచ్చే ఏడాది జులైలో ఆర్-ఆర్-ఆర్ రిలీజ్ అయితే.. ఆ వెంటనే మినిమం గ్యాప్స్ లో త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ సినిమాలు కూడా థియేటర్లలోకి వచ్చేస్తాయన్నమాట. వీటిలో ప్రశాంత్ నీల్ మూవీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై, త్రివిక్రమ్ తో సినిమా హారిక-హాసిని బ్యానర్ పై వస్తుంది. ఎన్టీఆర్ ప్లానింగ్ అదుర్స్ కదా!