నాగార్జున – కొంతకాలంగా లెక్క మార్చాడు...

Tuesday,August 06,2019 - 12:02 by Z_CLU

టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది టాప్ స్టార్స్ నాగార్జున. కానీ కొంతకాలంగా స్టార్ డైరెక్టర్స్ ని ప్రిఫర్ చెయ్యట్లేదు. అప్పుడప్పుడే సెటిలవుతున్న యంగ్ డైరెక్టర్స్ ని గైడ్ చేస్తూ, ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసే సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతున్న ‘మన్మధుడు 2’ అలాంటిదే.

రాహుల్ రవీంద్రన్ : చేసింది జస్ట్ ఒకే ఒక సినిమా ‘చి.ల.సౌ.’. సెకండ్ మూవీకి నాగార్జున రేంజ్ స్టార్ తో సినిమా చేసే అవకాశం దక్కింది. అయితే రాహుల్, నాగ్ కోసం ప్రత్యేకంగా కథ రెడీ చేసుకుని వెళ్ళి ఇంప్రెస్ చేయలేదు. నాగార్జున స్వయంగా రాహుల్ కి ఈ రెస్పాన్సి బిలిటీ అప్పగించాడు. తన ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలనుకుంటున్నారో రాహుల్ చేత, పక్కా అలాంటి సినిమానే తెరకెక్కించుకున్నాడు.

శ్రీరామ్ ఆదిత్య : నానితో కలిసి చేసిన మల్టీస్టారర్ ‘దేవదాస్’  డైరక్టర్ కి కూడా అప్పటికీ జస్ట్ ఒక్క సినిమా అనుభవమే. ‘భలే మంచిరోజు’ సక్సెస్ శ్రీరామ్ కి సెన్సిబుల్ డైరెక్టర్ అనే లేబుల్ ని క్రియేట్ చేస్తే, నాగార్జున ‘దేవదాస్’ తో ఇచ్చిన అవకాశం, స్టార్ డైరెక్టర్ ని చేసింది. ఈ సినిమాకి కూడా దగ్గరుండి ప్రతి క్రాఫ్ట్ లో ఇన్వాల్వ్ అయ్యాడు నాగార్జున.

కళ్యాణ్ కృష్ణ : ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాతోనే డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఇప్పుడు కూడా ఈ డైరెక్టర్ తోనే ‘బంగార్రాజు’ సినిమాకి ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి స్క్రిప్ట్ వర్క్ దగ్గరే ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.

ఏ సినిమా చేసిన ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయడమే ఎజెండాగా పెట్టుకునే   నాగ్, ఫ్యాన్స్ కి నచ్చే కథలకే ఎక్కువ  ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఈ ప్రాసెస్ లో యంగ్ డైరెక్టర్స్ తోనే సక్సెస్ అందుకుంటున్నాడు.