'రకుల్ ప్రీత్' ఇంటర్వ్యూ

Tuesday,August 06,2019 - 01:21 by Z_CLU

మరో మూడు రోజుల్లో అవంతికగా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతోంది రకుల్ ప్రీత్. నాగార్జున సరసన రకుల్ హీరోయిన్ గా నటించిన ‘మన్మధుడు 2’ ఆగస్ట్ 9 న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా రకుల్ మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు రకుల్ మాటల్లోనే..

ఫన్ క్యారెక్టర్

సినిమాలో నేను అవంతిక అనే క్యారెక్టర్ లో నటించాను. చాలా ఫన్ క్యారెక్టర్. ఒక ఎనర్జీతో సరదాగా గడిపేసే అమ్మాయి. ఫన్ గర్ల్ అయినప్పటికీ కొంచెం మెచ్యూరిటీ కూడా ఉంటుంది.పెర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఇప్పటి వరకూ నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. అందుకే ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తూ చేసాను.

ఫ్యామిలీలా కలిసిపోయాం

అవంతిక క్యారెక్టర్ నాగార్జున గారు చేసిన సామ్ క్యారెక్టర్ కి సమానంగా ఉంటుంది. కథలో ఈ రెండు మెయిన్ క్యారెక్టర్స్. వీరిద్దరి మధ్యే కథ నడుస్తుంది. ఇలాంటి క్యారెక్టర్ నాకొచ్చినందుకు చాలా హ్యాపీ. సినిమా వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ చాలా బాగుంది. సినిమాకి పనిచేసిన అందరూ ఫ్యామిలీలా కలిసిపోయాం. షూటింగ్ చివరి రోజు సినిమా అప్పుడే అయిపోయిందా ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది అనిపించింది.

స్టోరీ కే ఇంపార్టెన్స్

నాగ్ సార్ తో సినిమా చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఆయన చాలా సపోర్టీవ్ కో స్టార్. ఆర్టిస్టుల విషయంలో చాలా సెక్యూర్ గా ఉంటారు. నైస్ పర్సన్. ఎప్పుడూ కథకే ఇంపార్టెన్స్ ఇస్తారు. సినిమాలో కొన్ని సందర్భాల్లో ఆయన కంటే మాకే కొన్ని ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి. అయినా ఆయన అవేం పట్టించుకోరు. స్టోరీ ని నమ్మి డైరెక్టర్ కి ఫుల్ ఫ్రీడం ఇస్తారు.

రాఖీ బ్రదర్

రాహుల్ నాకు రాఖీ బ్రదర్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ నుండి తను నాకు తెలుసు. నేను భడే భయ్యా అనిపిలుస్తాను. రాహుల్ నన్ను కిడో అంటుంటాడు. కాని రాహుల్ తో కలిసి సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైం. సినిమా షూటింగ్ కి వెళ్ళాక స్క్రిప్ట్ మీద రాహుల్ కి ఉన్న క్లారిటీ నాకు బాగా నచ్చింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా స్ట్రాంగ్ చేసుకున్నాడు. నెల ముందే నాకు పూర్తి కథ ఇచ్చేశాడు. దానివల్ల షూటింగ్ లో నా పని చాలా ఈజీ అయిపొయింది. సీన్స్ మొత్తం తెలుసు కనుక పెద్దగా కష్టపడకుండానే నటించేసా. రాహుల్ అందరికీ ముందే స్క్రిప్ట్ ఇవ్వడం వల్ల తక్కువ డేస్ లో టోటల్ షూట్ ఫినిష్ చేయగలిగాం.

అదే స్టోరీ

సినిమాలో నేను నాగార్జున గారికంటే ఇరవై ఐదేళ్ళు చిన్న. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా కుదిరింది అసలు వీళ్ళిద్దరూ ఎలా కలిసారు అనేదే స్టోరీ. అది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమాలో నేను నాగ్ సార్ ఏజ్ మీద చాలా జోక్స్ వేస్తుంటాను. అదంతా కథలో భాగమే.

అదొక్కటి తప్ప

నేను హిందీ లో చేసిన ‘దే దే ప్యార్ దే’ సినిమాకు ఈ సినిమాకు సంబంధం ఉండదు. రెండిటిలో నాది హీరో కంటే చాలా చిన్న వయసు. అదొక్కటి మినహా స్క్రిప్ట్, ట్రీట్ మెంట్ వేరుగా ఉంటుంది. ఇదొక హ్యాపీ ఫ్యామిలీ ఫిలిం.

అందులో భాగమే

సినిమాలో నేను కొన్ని సందర్భాల్లో సిగరెట్ కాలుస్తాను. రొమాంటిక్ సీన్స్ కూడా చేసాను. అవన్నీ క్యారెక్టర్ లో భాగమే. నిజ జీవితంలో నేను సిగరెట్ తగను. చాలా హెల్తీగా ఉంటాను. కాని సినిమా కోసం డైరెక్టర్ చెప్పిన క్యారెక్టర్ కోసం కొన్ని చేయక తప్పదు. నటిగా అది నా భాద్యత. సినిమా చూసాక ఆడియన్స్ అవన్నీ పట్టించుకోరు.

సైన్ చేసాకే

ఇంతకుముందు ‘మన్మధుడు’ చూడలేదు. ఈ సినిమా సైన్ చేశాకే చూసాను. చాలా నచ్చింది.

స్టోరీ లైన్ మాత్రమే

సినిమా ఫ్రెంచ్ సినిమాకు రీమేక్ అయినప్పటికీ చాలా చేంజెస్ జరిగాయి. జస్ట్ స్టోరీ లైన్ మాత్రమే తీసుకొని చేసిన సినిమా ఇది. మన తెలుగు ఆడియన్స్ కి నచ్చే టట్లు అన్ని ఎలెమెంట్స్ యాడ్ చేసి రాహుల్ ఈ సినిమా చేసాడు.

అందులో కిక్ ఉండదు

నేను చేసిన సినిమానే మళ్ళీ చేయలనుకోను. మళ్ళీ అదే క్యారెక్టర్ చేస్తే కిక్ ఉండదు. ఒక వేళ నా సినిమా రీమేక్ కి నన్ను అప్రోచ్ అయితే వెంటనే నో చెప్పేస్తాను.

మిగతావి పట్టించుకోను

సీనియర్ హీరోలతో ఛాన్స్ వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ గురించి మాత్రమే ఆలోచిస్తాను. మిగతావి పట్టించుకోను. స్టోరీ కి ఏం అవసరం… ఆ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఏంటనేది మాత్రం చూస్తాను.

పర్ఫెక్ట్ రోల్ కాబట్టే చేస్తున్నా

‘దే దే ప్యార్ దే’ ,’మన్మధుడు 2′ లో హీరోలు సీనియర్సే కానీ అందులో నా వయసు తక్కువే. నాలా నేను కనిపిస్తా. అలాంటి రోల్స్ చాలా తక్కువగా వస్తుంటాయి. చేస్తే తప్పేంటి.. ఒక యంగ్ హీరో సినిమాలో నాలుగు సీన్స్ , మూడు సాంగ్స్ ఉండే క్యారెక్టర్ కంటే ఇలాంటి సినిమాలు చేయడం తప్పేం కాదు.

నెక్స్ట్ మూడు సినిమాలు

ప్రస్తుతం ‘ఇండియన్ 2’లో సిద్దార్థ్ తో కలిసి చేస్తున్నాను. తెలుగులో నితిన్ తో సినిమా చేస్తున్నాను. అందులో ఓ క్రిమినల్ లాయర్ గా కనిపిస్తాను. హిందీలో మరో సినిమా సైన్ చేసాను. ప్రస్తుతానికి ఈ మూడు సినిమాలతో బిజీ.