NTR-Trivikram Movie - ప్లాన్ రెడీ!

Monday,September 07,2020 - 01:48 by Z_CLU

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సినిమాకైనా పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడిన సినిమాలన్నీ ఇప్పుడు ఓ ప్లానింగ్ ప్రకారం షూటింగ్ కి రెడీ అవుతున్నాయి. అయితే మోస్ట్ ఎవైటింగ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటైన ‘NTR30’ షూటింగ్ కి సంబంధించి కూడా ఓ ప్రణాళిక సిద్దం చేస్తున్నాడు Trivikram. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి NTR- Trivikram Movie సినిమా సెట్స్ పైకి రావాలి. కానీ RRR షూట్ వాయిదా పడటంతో ప్లాన్ లో మార్పులు వచ్చాయి.

అందుకే ఇప్పుడు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి సినిమా షూటింగ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఫిబ్రవరిలో మొదలు కానున్న భారీ షెడ్యుల్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. మరికొన్ని రోజుల్లో లోకేషన్స్ కూడా ఫైనలైజ్ చేయనున్నాడు త్రివిక్రమ్. తారక్ ప్రేస్టీజియస్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాను హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధా కృష్ణ నిర్మించనున్నారు.