NTR31 ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ డ్రీం ప్రాజెక్ట్ !
Friday,May 20,2022 - 01:28 by Z_CLU
NTR31 awaited combo announced with Pre Look Poster
కొన్ని కాంబినేషన్ సినిమాల గురించి ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఆ లిస్టులో కాంబోల్లో ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ కాంబో ఒకటి. KGF 1 నుండే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ ఓ యాక్షన్ సినిమా చేస్తే బాగుంటుందని కోరుకున్నారు. ఇక ‘KGF చాప్టర్ 1’ సినిమా రిలీజైన వెంటనే ఎన్టీఆర్ ప్రశాంత్ తో ప్రాజెక్ట్ లాక్ చేసుకొని మైత్రి నిర్మాతలతో అడ్వాన్స్ కూడా ఇప్పించాడు. ఈ విషయాన్ని ఆ నిర్మాతలే చెప్పుకున్నారు.
అయితే ఈ కాంబోలో సినిమా రానుందని ఎప్పుడో ఎనౌన్స్ చేశారు. తాజాగా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రీ లుక్ పోస్టర్ తో అప్ డేట్ ఇచ్చి ఎన్టీఆర్ కి విషెస్ చెప్పారు మేకర్స్. తారక్ హాఫ్ ఫేస్ తో ఇంటెన్స్ గా కనిపిస్తూ గ్రే కలర్ తో డిజైన్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తోంది.

సహజంగానే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో అంటే సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉంటాయి. ఇప్పుడు పోస్టర్ తో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. “ఇరవై ఏళ్ల నుండి నా మైండ్ లో ఉండిపోయిన డ్రీం ప్రాజెక్ట్ ను అదీ నా డ్రీం హీరోతో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది” #NTR31 ప్రాజెక్ట్ గురించి ఓ నోట్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు ప్రశాంత్
ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో కళ్యాణ్ రామ్, మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.
* Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics