దసరా నుంచి ఎన్టీఆర్ సినిమా

Thursday,June 11,2020 - 01:59 by Z_CLU

RRR వల్ల త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో రావాల్సిన సినిమాపై క్లారిటీ రాలేదు. షూటింగ్స్ కు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో.. RRR షూట్ కు లైన్ క్లియర్ అయింది. దీంతో త్రివిక్రమ్-ఎన్టీఆర్ మూవీపై కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. దసరా నుంచి ఈ సినిమాను ప్రారంభించబోతున్నారు.

“అల వైకుంఠపురములో” సినిమా సక్సెస్ తర్వాత పూర్తిగా ఎన్టీఆర్ తో చేయాల్సిన ప్రాజెక్టుపైనే ఫోకస్ పెట్టాడు త్రివిక్రమ్. ఇందులో భాగంగా మూవీకి సంబంధించి కథ-స్క్రీన్ ప్లే మొత్తం పూర్తయింది. RRR షూట్ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే ఈ సినిమా మొదలవుతుంది. ఇందులో ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తోంది.

అరవింద సమేత FULL MOVIE

కెరీర్ లో ఎన్టీఆర్ చేయబోతున్న 30వ సినిమా ఇది. అరవింద సమేత తర్వాత తారక్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. హారిక-హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతానికి ఇదే అప్ డేట్.