మరో వేడుకకు సిద్ధమైన శాతకర్ణి

Wednesday,January 04,2017 - 04:32 by Z_CLU

 

ఇప్పటికే ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేేట్ చేశారు. అంతకంటే ముందు ట్రయిలర్ ను ఒకేసారి వంద లొకేషన్లలో లాంఛ్ చేశారు. ఇలా సినిమా లాంఛింగ్ నుంచి ప్రతి సందర్భాన్ని ఎంతో ఆర్భాటంగా, ఉత్సవంలా సెలబ్రేట్ చేస్తోంది గౌతమీపుత్ర శాతకర్ణి యూనిట్. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి దేశవ్యాప్తంగా వంద దేవాలయాల్లో అభిషేకాలు నిర్వహించే కార్యక్రమం కూడా జోరుగా సాగుతోంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగాా మరో వేడుకను షురూ చేేశాడు నటసింహం బాలకృష్ణ.

gautamiputra-2

 

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు మరింత ప్రచారం కల్పించేందుకు… శాతకర్ణి పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రకటించారు. జనవరి 8న తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి వంద ప్రాంతాల్లో శాతవాహన పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా జరగనుంది. నందమూరి బాలకృష్ణ,విశాఖలో ఏర్పాటుచేసే ప్రత్యేక కార్యక్రమంలో శాలివాహన పతాకాన్ని ఆవిష్కరించారు.

gautamiputra-fature

మరోవైపు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల నుంచి పన్ను మినహాయింపు లభించే అవకాశాలున్నాయి. తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా సినిమా ఉండడంతో, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాకు వినోదపు పన్ను రాయితీ లభించే అవకాశాలున్నాయి. సెన్సార్ పూర్తయిన తర్వాత పన్ను మినహాయింపుగా ఓ క్లారిటీ వస్తుంది.