Actress Vijayashanthi to play NTR’s aunty in NTR30 ?
ఎన్టీఆర్ , కొరటాల శివ డైరెక్షన్ లో NTR30 ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అక్టోబర్ నుండి మొదటి షెడ్యుల్ జరుపుకోనుందని సమాచారం. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో విజయశాంతి నటించనుందని టాక్ వినిపిస్తుంది. సినిమాలో విజయశాంతి ఎన్టీఆర్ కి అత్తగా కనిపించనుందని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ విషయంపై మేకర్స్ నుండి ఎలాంటి ప్రకటన లేదు కానీ సినిమాలో విజయశాంతి నటించడం పక్కా అని తెలుస్తుంది.
విజయశాంతి చాలా గ్యాప్ తర్వాత మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె మరే సినిమా ఒప్పుకోలేదు. తాజాగా కొరటాల శివ విజయశాంతి కి స్క్రిప్ట్ నెరేట్ చేసి స్పెషల్ కేరెక్టర్ కి ఒప్పించడాని సమాచారం. అయితే తన పాత్రకు కథలో ఇంపార్టెన్స్ ఉంటే కచ్చితంగా విజయశాంతి నటిస్తుంది. అందులో సందేహమే లేదు. మిర్చి సినిమాతో నదియా కి మంచి పాత్ర ఇచ్చి ఆమెను నటిగా మరింత బిజీ చేశాడు కొరటాల. ఇప్పుడు విజయశాంతి తో అలాంటి మంచి పాత్రను చేయించాలని కొరటాల ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయంపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మిక్కిలినేని సుధాకర్ , కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
*Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics