ఆ వార్తలో నిజం లేదు...

Tuesday,December 20,2016 - 02:00 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకెళ్లాలని చూస్తున్నాడు. ప్రెజెంట్ డాలీ డైరెక్షన్ లో ‘కాటమరాయుడు’ సినిమా చేస్తున్న పవన్ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమాను తమిళ దర్శకుడు నేసన్ తో ఓ సినిమాను చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

 నేసన్ డైరెక్షన్ లో నటించబోయే సినిమా ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా లో పవన్ సిస్టర్ గా మలయాళ బ్యూటీ నివేత థామస్ నటిస్తుందని వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో పవన్ సిస్టర్ రోల్ చేసేందుకు ఈ భామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనే టాక్ గట్టిగానే వినిపించగా రీసెంట్ గా ఆ సినిమాలో తను నటించడం లేదని ఆ వార్తలో నిజం లేదని చెప్పుకొచ్చింది నివేత. సోషల్ మీడియా లో ఈ అమ్మడు ను ఈ రోల్ గురించి పవన్ అభిమాని ప్రశ్నించగా అలాంటిదేమి లేదని ఆ వార్త నిజం కాదని చెప్పేసింది నివేత..

pawan-fan-tweet

nivetha-tweet