డెసిషన్ తీసుకున్నాడు.. కానీ...
Tuesday,December 20,2016 - 03:00 by Z_CLU
వరుస హిట్స్ అందుకుంటూ టాలీవుడ్ లో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుసగా గెస్ట్ రోల్స్ తో ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇటీవలే ‘మజ్ను’ సినిమా క్లైమాక్స్ లో కాసేపు పెళ్లికొడుకు గెటప్ తో ఎంటర్టైన్ చేసిన ఈ కుర్రహీరో లేటెస్ట్ గా మరోసారి అదే గెటప్ తో గెస్ట్ గా కనిపించి థియేటర్ లో సందడి చేస్తున్నాడు.
హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ క్లైమాక్స్ లో కూడా పెళ్లికొడుకు గెటప్ తో కాసేపు గెస్ట్ గా ఎంటర్టైన్ చేసాడు రాజ్ తరుణ్. దీంతో ఈ కుర్ర హీరోకు వరుసగా గెస్ట్ రోల్స్ ఆఫర్స్ చేస్తున్నారట డైరెక్టర్స్. అయితే నాని మాత్రం ఇకపై గెస్ట్ రోల్స్ చేయనుంటున్నాడు. డైరెక్టర్ విరించి కోసం ‘మజ్ను’ లో, ‘సినిమా చూపిస్త మావ’ టీం కోసం ‘నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్’ సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ చేశానే తప్ప… ఇకపై అలాంటి పాత్రల్లో కనిపించనంటున్నాడు.