మహానుభావుడిగా మారిన శర్వా

Tuesday,December 20,2016 - 01:00 by Z_CLU

‘భలే భలే మగాడివోయ్’ వంటి సరి కొత్త ఎంటర్టైన్ మెంట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ మారుతి మరో సారి అలాంటి డిఫరెంట్ ఎంటర్టైన్ మెంట్ సినిమాతో రెడీ అవుతున్నాడు. శర్వా నంద్, మెహ్రీన్ హీరోహీరోయిన్స్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మించబోతున్నారు.

    త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి ‘మహానుభావుడు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశాారని సమాచారం. ఈ సినిమాలో శర్వా క్యారెక్టర్ కి ఈ టైటిల్ పర్ఫెక్ట్ అనిపించడంతో ఈ టైటిల్ ను రిజిస్టర్ చేశారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న శర్వాను ఈ సినిమాతో సరికొత్తగా చూపించి ‘భలే భలే మగాడివోయ్’ లాంటి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు మారుతి.