ఆడియో లాంచ్ కాదు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ?

Tuesday,March 21,2017 - 12:08 by Z_CLU

బాహుబలి యూనిట్ మెగా ట్రెండ్ ఫాలో అవుతుంది. మార్చి 26 న రామోజీ ఫిలిం సిటీ లో గ్రాండ్ గా ఆడియో లాంచ్ అనౌన్స్ చేసిన సినిమా యూనిట్, ఇప్పుడు ఆడియో లాంచ్ చేసే ఆలోచనని మార్చుకుందట. కాకపోతే అదే రోజు అదే లొకేషన్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకుంటోందట.

ఇంత సడెన్ గా డెసిషన్ మార్చుకోవడానికి రీజన్స్ అయితే తెలీదు కానీ, ఫ్యాన్స్ మాత్రం ఆడియో ఫంక్షన్ అయినా, ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా ఎగ్జైట్ మెంట్ లో మాత్రం కించిత్ కూడా తేడా లేదు అంటున్నారు.

 

ఏప్రియల్ 28 న గ్రాండ్ రిలీజ్ కి రెడీగా ఉన్నా బాహుబలి 2 మానియా యూట్యూబ్ లో గంట గంటకి పెరిగిపోతున్న వ్యూస్ చూస్తే తెలిసిపోతుంది. ఇప్పటికే 100 మిలియన్స్ వ్యూస్ దాటేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది బాహుబలి ట్రేలర్. మరి బాహుబలి 2 ఆడియోని సింపుల్ గా ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తారా..? లేకపోతే సినిమా యూనిట్ మైండ్ లో ఇంకేదైనా క్రియేటివ్ ఆలోచనలున్నాయా అనేది ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు తేలిపోతుంది.