1000 థియేటర్స్ లో రీరిలీజ్

Friday,April 07,2017 - 03:37 by Z_CLU

బాహుబలి హిందీలో రీ రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 7 నుండి 17 లోపు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి బాహుబలి 2 టికెట్ గ్యారంటీ అని అష్యురెన్స్ ఇచ్చిన నిర్మాతలు , ఈ సినిమాని ఏకంగా 1000 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇంత భారీ స్థాయిలో రీ రిలీజ్ అవుతున్న సినిమా బాహుబలి.

బాహుబలి ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడే ఒక్క హిందీ వర్షన్ లోనే 100 కోట్లు వసూలు చేసింది. ఇప్పడు బాహుబలి 2 ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత అనిల్ తడాని, కరణ్ జోహార్ ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. దానికి తోడు బాలీవుడ్ లో ఈ వారం పెద్ద సినిమాల రిలీజెస్ ఏమీ లేకపోవడంతో బాహుబలి రిలీజ్ కి ఏ అడ్డంకి లేకుండా పోయింది.

ఇక బాహుబలి 2 ఏప్రియల్ 28 న జస్ట్ ఇండియాలోనే ఏకంగా 6000 థియేటర్స్ లో కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ కి కూడా రేపో మాపో ప్యాకప్ చెప్పనున్న సినిమా యూనిట్, ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్రమోషన్స్ కి రెడీ అవుతున్నారు.