సమంతా క్యారెక్టర్ రివీల్ అయింది

Tuesday,April 11,2017 - 12:05 by Z_CLU

మహానటి సావిత్రి బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ పనులు ఫాస్ట్ పేజ్ లో జరుగుతున్నాయి. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ లో మాహానటి సావిత్రి క్యారెక్టర్ లో కీర్తి సురేష్ నటిస్తుంది. సమంతా ఇందులో ఓ కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఆ కీ రోల్ ఏంటో క్లారిటీ ఇచ్చేసింది సినిమా యూనిట్.

ఈ సినిమాలో మహానటి సావిత్రి లైఫ్ కి సంబంధించి రీసర్చ్ చేసే జర్నలిస్ట్ క్యారెక్టర్ లో నటిస్తుంది సమంతా. అయితే 80’s బ్యాక్ డ్రాప్ లోని జర్నలిస్ట్ లా సమంతా క్యారెక్టర్ ని డిజైన్ చేసిన ఫిలిం మేకర్స్, ఇంకా సావిత్రి లైఫ్ కి సంబంధించిన కీ ఎలిమెంట్స్ ని కలెక్ట్ చేసే పనిలోనే ఉంది.

స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఉమెన్స్ డే రోజు అనౌన్స్ చేశారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత మళ్ళీ అదే రేంజ్ సోల్ ఉన్న సినిమాలా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్న నాగ్ అశ్విన్, త్వరలో సినిమాని సెట్స్ పైకి తెచ్చే ఆలోచనలో ఉన్నాడు.