కాటమరాయుడుతో చేతులు కలిపిన మిస్టర్

Tuesday,March 21,2017 - 12:58 by Z_CLU

 ఏప్రియల్ 7 నుండి థియేటర్స్ లో అల్టిమేట్ రొమాంటిక్ ఎసెన్స్ ని స్ప్రెడ్ చేయడానికి రెడీ అవుతుంది వరుణ్ తేజ్ మిస్టర్. శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రేలర్ ఆల్ మోస్ట్ రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే ఈ ట్రేలర్ ని కాటమరాయుడు సినిమాతో ఎటాచ్ చేస్తుంది సినిమా యూనిట్.

ఏప్రియల్ 24 నుండి థియేటర్స్ లో రిలీజ్ కానున్న కాటమరాయుడు సినిమాతో పాటు మిస్టర్ ట్రేలర్ ని కూడా థియేటర్స్ లో ప్రదర్శించే ఆలోచనలో ఉన్నారు ఫిలిం మేకర్స్. ఇప్పటికే నీట్ & క్లీన్ ఎంటర్ టైనర్ గా ఎట్రాక్ట్ చేస్తున్న మిస్టర్ ఈ ట్రేలర్ తో మెగా ఫ్యాన్స్ కి మరింత చేరువ కానుంది.

 

నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు. రీసెంట్ గా సాంగ్ ఏదో ఏదో బాగుందే… ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించిన విషయం తెలిసిందే.