నిత్యామీనన్ ఇంటర్వ్యూ

Monday,February 19,2018 - 04:29 by Z_CLU

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ‘అ!’. విమర్శకుల ప్రశంసలు పొందుతున్న ఈ సినిమాని నాని నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న నిత్యా మీనన్, ఈ సినిమా గురించి చాలా విషయాలు షేర్ చేసుకుంది అవి మీకోసం…

 

చాలా ఎగ్జైటెడ్ అయ్యాను….

చాలా స్టోరీస్ వింటుంటాం కానీ, ఫస్ట్ టైమ్ విన్నప్పుడే చాలా డిఫెరెంట్ అనిపించింది. చాలా ఎగ్జైటెడ్ అయ్యాను….

ఆర్టిస్ట్ ఫార్మాట్…

ఒక ఆర్టిస్ట్ పై ఒకలాంటి ఇమేజ్ ఫిక్సయితే వరసగా అలాంటి సినిమాలే వస్తుంటాయి. కానీ ఈ సినిమాలో అలా కాదు.. క్యారెక్టర్ ని బట్టి కాస్టింగ్ చేయడం జరిగింది. అమేజింగ్ అనిపించింది.

అసలు అలాంటి ఆలోచన లేదు….

ఏదైనా సరే సినిమా చేసేటప్పుడు, స్టోరీ… అందులో మనం చేసే క్యారెక్టర్ నచ్చిందా లేదా అదొకటే ఆలోచిస్తాను. దానికి తోడు రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా వీలైతే డిఫెరెంట్ గా చేయాలి అనే ఆలోచనే తప్ప, ఇది చేస్తే నా కరియర్ కి ప్లస్, ఇది చేస్తే నా కరియర్ కి మైనస్ లాంటి ఆలోచనలు ఉండకూడదు.

 

నేను అదే టైపు…

నానికి ముందే తెలుసు ఒకవేళ నాకీ స్టోరీ న్యారేట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో నో చెప్పనని. నాకు రెగ్యులర్ గా ఒకేలాంటి సినిమాలు చేస్తే బోర్ కొట్టేస్తుంది…

ప్రశాంత్ కోసం చేశాను…

ఈ సినిమాని నాని కోసం ఓకె చేపలేదు. ప్రశాంత్ కోసం, ఆ స్టోరీ కోసం ఓకె చెప్పాను. అసలు నాకు స్టోరీ చెప్పే టైం కి,  నాని ప్రొడ్యూస్ చేద్దామని డెసిషన్ కూడా తీసుకోలేదు…

నిర్ణయం నాదే…

నాకు ప్రశాంత్ స్టోరీ చెప్పినప్పుడు రాధ క్యారెక్టర్ తో పాటు, నా క్యారెక్టర్.. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రశాంత్ నన్ను రెండింట్లో ఏదైనా చూజ్ చేసుకొమ్మన్నప్పుడు పర్ఫామెన్స్ కి స్కోప్ ఎక్కువగా ఉన్నా, రాధ క్యారెక్టర్ చాలా ఫెమినిన్ క్యారెక్టర్ అనిపించింది. అంటే ప్రస్తుతం నాకున్న ఇమేజ్ కి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే డిఫెరెంట్ గా ఉండాలనే క్రిష్ క్యారక్టర్ చూజ్ చేసుకున్నాను…

ఆటోమేటిక్ గా జరిగిపోతుంది…

ఏదైనా కొత్త క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు పర్టికులర్ గా హోమ్ వర్క్ చేయడం లాంటిది ఉండదు కానీ, డెఫ్ఫినేట్ గా థాట్ ప్రాసెస్ నడుస్తుంటుంది. ఆ క్యారెక్టర్ గురించి బిగినింగ్ నుండి ఆలోచిస్తూనే ఉంటాను. కానీ సెట్ లో కెమెరా ముందుకు వెళ్ళగానే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది…

 

ఛాలెంజింగ్ గా అనిపించలేదు…

నా కరియర్ లో ఛాలెంజింగ్ అనిపించినా రోల్ కాంచన 2 లో గంగ రోల్. చాలా కష్టపడాల్సి వచ్చింది ఆ క్యారెక్టర్ కోసం. ఆ తరవాత ఈ సినిమా, కొత్తగా అనిపించింది. ఇన్వాల్వ్ అవ్వడానికి టైమ్ పట్టింది కానీ, మరీ అంత చాలెంజింగ్ రోల్ ఏం కాదు…

ఇమ్మీడియట్ గా నో చెప్పేస్తా…

నేను స్టోరీ విన్నప్పుడు కొద్దిగా నచ్చకపోయినా నో చెప్పేస్తా.. ఒక 200 స్టోరీస్ వింటే అందులోంచి మహా అయితే 6 – 7 స్టోరీస్ కి ఓకె చెప్తా. అందుకే నాకు స్టోరీస్ చెప్పేవాళ్ళు కూడా డెఫ్ఫినేట్ గా ఏదైనా డిఫెరెంట్ గా ఉందనిపిస్తేనే నన్ను అప్రోచ్ అవుతారు.

N.T.R. బయోపిక్ కి అప్రోచ్ అయ్యారు…

తేజ డైరెక్షన్ లో రానున్న N.T.R. బయోపిక్ కోసం కూడా అప్రోచ్ అయ్యారు. కానీ అది వర్కవుట్ అవ్వలేదు…

నేను రైటర్ ని కూడా…

నేను స్క్రిప్ట్స్ కూడా రాసుకుంటూ ఉంటాను. అప్పటికప్పుడు ఏదైనా ఇన్స్ పైర్ చేస్తే రాసేస్తుంటాను. కొన్ని కంప్లీట్ చేస్తుంటా… కొన్ని మధ్యలో వదిలేస్తుంటా.. రీసెంట్ గా ‘ప్రాణ’ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ కూడా చేశా… యాక్టింగే కాకుండా సినిమాకి సంబంధించి వేరే పనులు చూసుకోవడమన్నా నాకిష్టమే…

డైరెక్షన్ చేస్తా…

నేను చాలా క్రియేటివ్ పర్సన్ ని. ప్రొడ్యూసర్ ని అయ్యే ఆలోచన కూడా నాకు లేదు.. మనీ మ్యానేజ్ మెంట్ లాంటివి నాకు అసలు పడవు.. కానీ ఫ్యూచర్ లో డైరెక్షన్ చేసే ఆలోచన ఉంది.

 

టాలీవుడ్ లో రివొల్యూషన్ రావాలి…

మలయాళం ఇండస్ట్రీ చాలా మారింది. మంచి సినిమాలు వస్తున్నాయి. డిఫెరెంట్ గా ఆలోచిస్తున్నారు కాబట్టే సక్సెస్ రేషియో పెరుగుతుది. అలాంటి రివొల్యూషన్ తెలుగులో రావాలి. సక్సెస్ అయిఆ అవ్వకపోయినా మార్పు అనేది కంపల్సరీ. అ! కూడా అలా అనుకుని చేసిందే…

అది నా బాధ్యత…

నేను ఏదైనా రోల్ చేసేటప్పుడు అది సొసైటీ పై ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనే ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. సొసైటీ పై నెగెటివ్ ఇంపాక్ట్ పడకుండా చూసుకోవడం నా బాధ్యత కూడా. అ! సినిమాలో నా రోల్ కూడా అలాగే ఆలోచించి చూజ్ చూసుకున్నాను.

సో స్పెషల్ మూవీ…

నా నెక్స్ట్ మూవీ ప్రాణ 4 భాషల్లో రిలీజవుతుంది. కేరళలో ఒక హిల్ స్టేషన్ లో చేశాము.అది ఏరియా బ్యాక్ డ్రాప్ మూవీ కాదు కాబట్టి లొకేషన్స్ అంత ఇంపార్టెంట్ కాదు సినిమాకి. స్టోరీ మొత్తం ఇక అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి పని చేశారు. సినిమాలో ప్రతి సౌండ్, ఆన్ లొకేషన్ రికార్డ్ అవుతుంది.

రికార్డ్ క్రియేట్ చేశాము…

4 భాషల్లో రిలీజవుతున్న ‘ప్రాణ’ సినిమాలో ఒక్కో షాట్ 4 సార్లు చేశాను. ఒక షాట్ చేసేటప్పుడు ఎక్కడైనా ఒక కాకి సౌండ్ వినిపించినా మళ్ళీ షూట్ చేయాల్సి వచ్చేది.. అయినా మేము ఆ సినిమాని 23 రోజుల్లో ఫినిష్ చేశాము… సినిమానే కాకుండా లైఫ్ అన్నాక చాలా ప్రయారిటీస్ ఉంటాయి. సినిమా సినిమాకి గ్యాప్ ఉంటున్నా.. నేను బిజీగానే ఉంటున్నా…

 

ఎవరూ అభినందించలేదు…

నా కరియర్ లో ఫస్ట్ టైమ్ చూస్తున్నా… ఇప్పటి వరకు మమ్మల్ని ఎవరూ అ! సినిమా చేసినందుకు ఎవరూ అప్రీషియేట్ చేయలేదు. ఎవరైనా డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. సినిమా గురించి మాట్లాడుతున్నారు… అలాగే ఉండాలి.. కష్టపడేదే సినిమా కోసం కాబట్టి సినిమా హైలెట్ అవ్వాలి…

ఇప్పుడనిపిస్తుంది…

‘మళ్ళీమళ్ళీ ఇదిరానిరోజు’ సినిమాలో నాకన్నా రెండేళ్ళు జూనియర్ అమ్మాయికి మదర్ లా చేశాను. అలాంటివి చేయడంలో నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు కానీ, అలాంటివి ఇంకెవరూ చేయరు కాబట్టి అలాంటి క్యారెక్టర్స్ కోసం నన్ను అప్రోచ్ అవుతున్నారు. ఒక్కోసారి మన ఇంటెన్షన్స్ కరెక్ట్ గా ఉన్నా, నెగటివ్ గా రిఫ్లెక్ట్ అవుతుంటుంది… కాబట్టి  నేను కొంచెం మారాలి…