మార్చి 22న కిరాక్ పార్టీ రిలీజ్

Monday,February 19,2018 - 05:02 by Z_CLU

నిఖిల్ అప్ కమింగ్ మూవీ కిరాక్ పార్టీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మార్చి 22న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. శరణ్ కొప్పిశెట్టి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

లెక్కప్రకారం ఈపాటికి థియేటర్లలోకి రావాలి కిరాక్ పార్టీ. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవ్వడం వల్ల విడుదల సాధ్యం కాలేదని స్వయంగా నిఖిల్ ప్రకటించాడు. త్వరలోనే విడుదల తేదీ ఎనౌన్స్ చేస్తామన్న నిఖిల్.. చెప్పినట్టుగానే షార్ట్ గ్యాప్ లోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశాడు.

కన్నడంలో సూపర్ హిట్ అయిన కిర్రాక్ పార్టీ సినిమాకు రీమేక్ గా అదే టైటిల్ తో తెలుగులో వస్తోంది ఈ సినిమా. మూవీకి సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే సమకూరుస్తుండగామరో దర్శకుడు చందు మొండేటి డైలాగ్స్ రాశాడు. సంయుక్త హెగ్జేసిమ్రాన్ పరీన్జా హీరోయిన్లుగా పరిచయమౌతున్న ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.