భారీ యాక్షన్ ఎపిసోడ్ లో బన్నీ

Monday,February 19,2018 - 02:01 by Z_CLU

కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోంది నా పేరు సూర్య సినిమా. బన్నీ, అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఇంటర్వెల్ లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ ను అన్నపూర్ణ స్టుడియోస్ లో తీశారు. ఇప్పుడు క్లైమాక్స్ కు చెందిన మరో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ యాక్షన్ బ్లాక్ షూటింగ్ నడుస్తోంది.

సినిమాలో సైనికుడిగా కనిపిస్తున్నాడు బన్నీ. ఈ మూవీ కోసం ఫారిన్ ట్రయినర్ శిక్షణలో బాడీ బిల్డప్ చేయడమే కాకుండా.. డిఫరెంట్ మేకోవర్ లో కూడా కనిపిస్తున్నాడు. మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు బన్నీ మేకోవర్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. ఈ నెలాఖరుకు సినిమా టాాకీ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది.

మరోవైపు మూవీకి సంబంధించి ఇప్పటికే 2 పాటల్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. త్వరలోనే మరో సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది నాపేరు సూర్య సినిమా.