నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ లో కీ పాయింట్

Wednesday,July 18,2018 - 11:31 by Z_CLU

ప్రస్తుతం పోస్ట్ పనులు జరుపుకుంటుంది నితిన్ శ్రీనివాస కళ్యాణం సినిమా. సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే వచ్చేనెల 9 న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేద్దామనే ప్లాన్ లో ఉన్న ఫిల్మ్ మేకర్స్ త్వరలో ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ తో పాటు ఆడియోని రిలీజ్ చేయనున్నారు. వాటి వివరాలను రేపు మార్నింగ్ 9 గంటలకు అనౌన్స్ చేస్తారు.

ఇప్పటి వరకు సినిమాలోని పెళ్ళి స్టిల్స్ ని మాత్రమే రిలీజ్ చేసి సినిమా చుట్టూ భారీ క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఫిల్మ్ మేకర్స్, కాన్సెప్ట్ టీజర్ లో సినిమాలోని కీ పాయింట్ ని రివీల్ చేయనున్నారని తెలుస్తుంది. దాంతో పాటు మిక్కీ. జె. మేయర్ సాంగ్స్ పై కూడా మ్యూజిక్ లవర్స్ లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

 

గతంలో ‘శతమానం భవతి’ లాంటి ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సారి కూడా అదే స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తాడని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యామిలీ ఆడియెన్స్. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు.