ఈ నెలలోనే నితిన్ కొత్త సినిమా

Friday,January 18,2019 - 09:02 by Z_CLU

కొత్త సినిమా ప్రిపరేషన్స్ లో ఉన్నాడు హీరో నితిన్. వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మరింత ఫ్రెష్ లుక్ లో కనిపించే ప్రాసెస్ లో ఉన్నాడు ఈ హీరో. ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈ నెల లాస్ట్ వీక్ నుండి సెట్స్ పైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో సాఫ్ట్ రోల్ లో కనిపించి మెస్మరైజ్ చేసిన నితిన్,ఈ సినిమాలో సమ్ థింగ్ స్పెషల్ అప్పియరెన్స్ తో సర్ ప్రైజ్ చేయనున్నాడని తెలుస్తుంది. వెంకీ కుడుముల ఈ సినిమాలో మోస్ట్ యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నాడని టాక్.

ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మండన్న హీరోయిన్ గా నటించనుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నాగవంశీ నిర్మించనున్నాడు.