రేపే ‘మిస్టర్ మజ్ను’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Friday,January 18,2019 - 10:03 by Z_CLU

రేపు జరగనున్న ‘మిస్టర్ మజ్ను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రిపరేషన్స్ లో బిజీ బిజీగా ఉంది టీమ్. మరీ ముఖ్యంగా యంగ్ టైగర్ NTR ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతుండటంతో ఈ ఈవెంట్ పై మరింత ఫోకస్ పెరిగింది. ఈ ఈవెంట్ లో ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తో పాటు NTR స్పీచ్ హైలెట్ కానుంది.

ఇప్పటికే సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశారు మేకర్స్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తరవాత మరింత అగ్రెసివ్ గా సినిమాను ప్రమోట్ చేయనున్న మిస్టర్ మజ్ను టీమ్, సినిమాని వైడ్ రేంజ్ లో రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ శనివారం JRC కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుండి బిగిన్ కానున్న ఈ ఈవెంట్ జీ సినిమాలు, జీ సినిమాలు HD ఛానల్స్ తో పాటు జీ సినిమాలు వెబ్ సైట్, ఫేస్ బుక్, యూ ట్యూబ్ ఛానల్స్ లో లైవ్ టెలీకాస్ట్ కానుంది. ఈ సినిమాకి వెంకీ అట్లూరి డైరెక్టర్. భోగవల్లి ప్రసాద్ ప్రొడ్యూసర్. జనవరి 25 న రిలీజవుతుంది మిస్టర్ మజ్ను.