నితిన్ ఇంటర్వ్యూ

Monday,August 07,2017 - 07:04 by Z_CLU

న్యూ లుక్ తో మెస్మరైజ్ చేస్తూ అబద్దాలతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు నితిన్. హను రాఘవపూడి డైరెక్షన్ లో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లై’ రిలీజ్ కి రెడీ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం నుంచి థియేటర్స్ లోకి సందడి చేయనున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు నితిన్.  ఆ విశేషాలు నితిన్ మాటలలోనే..

 

చాలా కథలు విన్నాను

‘అ ఆ’ తర్వాత చాలా కథలు విన్నాను. ఒక బిగ్గెస్ట్ హిట్ తర్వాత మళ్ళీ ఆ ఇమేజ్ ను కాపాడుకోవాలనే స్క్రిప్ట్ విషయం లో చాలా కేర్ తీసుకున్నాను. ఆ టైంలో హను నాకు ఈ స్టోరీ అరగంటలో చెప్పాడు. వినగానే క్యారెక్టర్, స్రిప్ట్ బాగా నచ్చాయి. వెంటనే ఓకే చేసేశా.

 

హైప్ బాగా పెరిగింది

సినిమా రిలీజ్ కి ముందే సాంగ్స్, టీజర్, ట్రైలర్ వల్ల బాగా హైప్ పెరిగింది. చాలా హ్యాపీ. సినిమా చాలా బాగా వచ్చింది. కచ్చితంగా ఆ హైప్ కి రీచ్ అవుతుందనే నమ్ముతున్నాం. ప్రెజెంట్ ఆగస్టు 11న ఈ సినిమా చూసి ఆడియన్స్ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నా.

చాలా కొత్తగా ఉంటుంది

సినిమా చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉంటుంది. కచ్చితంగా అందరూ ఎంటర్టైన్ అవుతారు. హను రాఘవపూడి ఈ సినిమా చెప్పగానే బాగా నచ్చింది. ‘అందాల రాక్షసి’, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమాలు తీసిన హను రాఘవపూడే ఈ సినిమా తీసాడా..అన్నట్టుగా ఉంటుంది.

 

ముందే డిసైడ్ అయ్యాం.

ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే మూడు నెలల ముందే లుక్ చాలా స్టైలిష్ గా డిఫరెంట్ గా ఉండాలని అనుకున్నాం. సినిమాలో మూడు లుక్స్ లో కనిపిస్తాను. ఇప్పటికే నా లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో హ్యాపీ.

 

హాలీవుడ్ లుక్ ఉండాలనుకున్నాం.

హను.. ముందు నుంచే ఈ సినిమాకు హాలీవుడ్ లుక్ ఉండాలి. హీరో లుక్ నుంచి ఆర్టిస్ట్ ల వరకూ స్టైలిష్ గా డిఫరెంట్ గా , గ్రాండియర్ గా ఉండాలి అంటుండే వాడు. సో ఫైనల్లీ ఇప్పుడు సినిమా చూస్తే మాకు కూడా హాలీవుడ్ లుక్ తీసుకొచ్చినట్లు అనిపించింది.

 

లవ్ ట్రాక్ కొత్తగా ఉంటుంది.

సినిమాలో నాకు మేఘ ఆకాష్ కి మధ్య వచ్చే లవ్ ట్రాక్ చాలా కొత్తగా ఉంటుంది. మేం మాట్లాడుకునే మాటలు పూర్తి ఆపోజిట్ గా ఉంటాయి. అన్ని అబద్దాలే ఉంటాయి. ఉదాహరణ కి తను ఐ లవ్ యు అంటే దాని అర్ధం ఐ హేట్ యు అని. సో ఇలా లవ్ ట్రాక్ అంతా చాలా కొత్తగా ఫ్రెష్ గా ఉంటుంది.

మంచి లవ్ స్టోరీ

సినిమా విషయానికొస్తే మంచి లవ్ స్టోరీతో పాటు నాకు అర్జున్ గారికి మధ్య ఉండే ఎనిమిటీ, మా ఇద్దరి ఇంటెలిజెన్స్, ఎత్తుకు పై ఎత్తు వేసే ఎలిమెంట్స్ తో స్టైలిష్ మూవీ గా ఎంటర్టైన్ చేస్తుంది.

 

హను మీద నమ్మకం పెరిగింది

హను నాకు ఈ స్క్రిప్ట్ చెప్పిన  తర్వాత తను డైరెక్ట్ చేసిన ప్రీవియస్ మూవీ ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమా చూశాను. ఆ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ మిక్స్ చేసి హను ఎంటర్టైన్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అప్పుడే హను చెప్పిన కథను ఇంకా బెటర్ గా తీయగలడనే నమ్మకం కలిగింది.

 

కథలో భాగమే

సినిమాలో కామెడీ కథలో భాగంగానే ఉంటుంది.. హను సెపరేట్ గా కామెడీ ట్రాక్ అంటూ ఏం క్రియేట్ చేయలేదు. కొన్ని సందర్భాలలో ఆ కామెడీ సీన్స్ కి థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తారు.

మణి శర్మ బిగ్ ఎస్సెట్

ఈ సినిమాకి  బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరైతే బాగుంటుందా..అనుకుంటుంటుండగా మణి శర్మ గారైతే బాగుంటుందని హను నేను అనుకున్నాం. చాలా మంది ఆయన ఇప్పుడు ఫామ్ లో లేరు కదా..రిస్క్ అవసరమా..అన్నారు. కానీ మేము ఆయన మ్యూజిక్ టాలెంట్ ని నమ్మి డిసిషన్ తీసుకున్నాం. ఇప్పుడు ఆయన సాంగ్స్ రిలీజ్ కి ముందే సినిమా పై హైప్ తీసుకొచ్చాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చారు. కచ్చితంగా రిలీజ్ తర్వాత మణి శర్మ గారే  సినిమాకు  బిగ్ ఎస్సెట్ అవుతారు.

 

కథను నమ్మి ఖర్చుపెట్టారు

నిజానికి ఈ సినిమా విషయంలో నిర్మాతలకి చాలా థాంక్స్ చెప్పాలి. కథని నమ్మి చాలా ఖర్చు పెట్టి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను నిర్మించారు. ముఖ్యంగా అమెరికా లొకేషన్స్ కి ఓకే చెప్పి యూనిట్ అందరినీ పంపించి సినిమాపై వారి కున్న ప్యాషన్ తెలియజేశారు.

 

అప్పుడు ఇప్పుడు సేమ్

అర్జున్ గారి తో ‘శ్రీ ఆంజనేయం’ తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకు పని చేయడం చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. నిజానికి ఆయనలో ఎలాంటి మార్పు లేదు. అప్పుడెలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. ఆయనని చూసి చాలా నేర్చుకోవాలి. ఓ స్టార్ లా ఫీలవ్వకుండా కేవలం ఓ నటుడిగా మాత్రమే కష్టపడటం ఆయనలో నాకు బాగా నచ్చే అంశం. ఈ సినిమా తర్వాత ఆయన బెస్ట్ విలన్ గా ఒక 4 ,5 ఇయర్స్ గుర్తుండిపోతారు. ఆయనే సినిమాకు మేజర్ హైలైట్.

మా ఛాయిస్ తనే

ఈ సినిమాకి హీరోయిన్ ఎవరైతే బాగుంటుందా.. అనుకుంటుంటుండగా ధనుష్ తో సినిమా చేస్తున్న మేఘ ఆకాష్ పేరు వినిపించింది. ముందు నుంచి అబ్రాడ్ లో షూటింగ్ కాబట్టి స్టార్ హీరోయిన్ డేట్స్ కుదరవని ఫ్రెష్ హీరోయిన్ కోసమే వెయిట్ చేశాం. సో అప్పుడు మా ఛాయిస్ మేఘ ఆకాష్ మాత్రమే. నా నెక్స్ట్ సినిమాలో కూడా మేఘ ఆకాష్ హీరోయిన్.

 

త్రివిక్రమ్ గారు చెప్పారని  

ప్రెజెంట్ హీరోయిన్స్ కొరత ఉండటంతో మేఘ ఆకాష్ ని శ్రేష్ట్ మూవీస్ పై ఇంకో సినిమాకి కూడా బుక్ చేశాం. అయితే నెక్స్ట్ సినిమాలో కూడా చేస్తే మా జోడి రిపీట్ అవుతుందని ఆడియన్స్ ఎలా ఫీలవుతారో అని ఆలోచిస్తుండగా త్రివిక్రమ్ గారు ఏం పరవాలేదు నిత్య తో కూడా ఇష్క్, గుండె జారీ గల్లతయ్యిందే’ సినిమాలు చేసావ్ కదా.. జోడీ బాగుంటే రిపీట్ అని ఫీలవ్వరు ఎంటర్టైన్ అవుతారని చెప్పారు. సో అలా నెక్స్ట్ కృష్ణ చైతన్య తో చేస్తున్న సినిమాలో కూడా తననే రిపీట్ చేస్తున్నా.

 

ప్రతీ సినిమాలో ఉండాల్సిందే

నిజానికి నా సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా వాడుతున్నాననే కామెంట్స్ వచ్చాయి. కానీ నిజానికి అవి నేను ప్లాన్ చేసుకొని పెట్టినవి కాదు. నా ప్రతీ సినిమాలో ఆయన రిఫరెన్స్ ఉంటుందంతే.. ఎవరు ఏమనుకున్నా అభిమానిగా ఆయనను ప్రతీ సినిమాతో గుర్తు చేసుకోవడం నా భాద్యతలా ఫీలవుతాను..