యాక్షన్ కింగ్ అదరగొట్టేశాడు
Monday,August 07,2017 - 04:00 by Z_CLU
నితిన్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘లై’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ శుక్రవారం థియేటర్స్ లోకి రానుంది. చాలా గ్యాప్ తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా ప్రెజెంట్ టాలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఆమధ్య ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో ఓ కీ రోల్ కోసం త్రివిక్రమ్ అర్జున్ ని సంప్రదించగా అర్జున్ సున్నితంగా తిరస్కరించాడన్న విషయం తెలిసిందే. కేవలం ఈ రోల్ మాత్రమే కాదు తెలుగులో చాలా పాత్రలకి ఆల్మోస్ట్ నో చెప్పాడట అర్జున్. అయితే ఇన్నేళ్ల తర్వాత అర్జున్ మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాతో అర్జున్ ఎలా ఎంటర్టైన్ చేస్తాడా.. అనే క్యూరియాసిటీ నెలకొంది.
ఇప్పటికే టీజర్ లో అర్జున్ చెప్పిన డైలాగ్, డిఫరెంట్ మ్యానరిజమ్స్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి. సినిమాలో అర్జున్ క్యారెక్టర్ అదిరిపోతుందని, లై సినిమాకు సెంటరాఫ్ ఎట్రాక్షన్ అర్జునే అని స్వయంగా హీరో నితిన్ చెప్పడం విశేషం.