నిఖిల్ ఇంటర్వ్యూ

Thursday,May 18,2017 - 06:30 by Z_CLU

ఇటీవలే ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్న నిఖిల్ ‘కేశవ’ గా థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నిఖిల్ మీడియా తో ముచ్చటించాడు.. ఆ విశేషాలు నిఖిల్ మాటల్లోనే…

 

ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ అదే

నిజానికి ఒక డిఫరెంట్ పాయింట్ తో సినిమా చేయాలనుకుంటుండగా సుధీర్ వర్మ ఈ కథ చెప్పాడు.. వినగానే బాగా ఎగ్జైట్ అయి ఈ కథతో సినిమా చేస్తే బాగుంటుందని డిసైడ్ అయిపోయాం. హార్ట్ రైట్ సైడ్ ఉండే వ్యక్తి ఏ మాత్రం టెన్షన్ పడకుండా తనకు అన్యాయం చేసిన వాళ్ళ పై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడనే కొత్త పాయింట్ బాగా నచ్చింది.. ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ అదే..

 

వాళ్లిద్దరూ కలిసి

కథలో హీరోకి ఓ ప్రాబ్లమ్ ఉండాలి అప్పుడు ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు అనేది చాలా ఇంటరెస్ట్ గా ఉంటుంది అంటూ సుధీర్ వర్మ-కృష్ణ చైతన్య ఇద్దరు కలిసి ఈ పాయింట్ ను కథలో చేర్చి సినిమా లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఆడ్ చేశారు..బేసిక్ గా వాళ్లిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ లో ఒక వ్యక్తి కి ఉన్న ఈ ప్రాబ్లమ్ నే  సినిమాలో నా క్యారెక్టర్ కి పెట్టారు..

 

చూపించింది చాలా తక్కువ

నిజానికి ట్రైలర్ చూసి ఆల్మోస్ట్ హైలైట్స్ అన్ని చూపించేశారు ఇంక సినిమాలో ఏం ఉంటుంది అంటున్నారు.. ట్రైలర్ లో మేము చూపించింది జస్ట్ 5 % మాత్రమే. సినిమాలో ఇంకా 95 % ఉంది. సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో అదిరిపోయే ఎమోషన్ ఉంటుంది. అవి ఆడియన్స్ ను బాగా థ్రిల్ చేస్తాయని మా నమ్మకం..

 

రీతూ అలా కనిపిస్తుంది

ఈ సినిమాలో రీతూ క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. కేవలం సాంగ్స్ కోసమో, రొమాంటిక్ సీన్స్ కోసమో అన్నట్టు కాకుండా రీతూ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసింది.. రెగ్యులర్ గా హీరో హీరోయిన్ ని కాపాడతాడు.. ఈ సినిమాలో రీతూ నన్ను ఓ రెండు మూడు సార్లు కాపాడుతుంది. పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్ గా అందరినీ మెస్మరైజ్ చేసిన రీతూ తో నటించడం చాలా హ్యాపీ గా ఉంది. కుదిరితే తనతో మరో సినిమా చేస్తా..


 ఆ అవకాశం వచ్చింది

నిజానికి ఇప్పటికి వరకూ ఫుల్లెన్త్  యాక్షన్ ఎంటర్టైనర్ లో  సీరియస్ గా నటించే ఛాన్స్ రాలేదు. కేశవ తో ఆ అవకాశం దక్కింది. నటుడిగా నాలో ఇంకో షేడ్ ను బయటపెట్టే అవకాశం వచ్చింది. ఇందులో నా యాక్షన్ చాలా సీరియస్ గా ఉంటుంది . ఇప్పటి వరకూ నన్ను ఆ ఏంజెల్ లో చూడని ఆడియన్స్ కొత్తగా ఎంటర్టైన్ అవుతారు.

 

అప్పుడు ఆ టెన్షన్ ఇప్పుడు ఈ టెన్షన్

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా రిలీజ్ టైం లో నోట్ల రద్దు సమస్య ఉంది. చాలా టెన్షన్ గా ఫీలయ్యా.. అసలు ఈ టైంలో ఈ సినిమా ఆడుతుందా ..? అనే డౌట్ వచ్చేసింది.. తీరా చూస్తే ఆ సినిమా మేం అనుకున్న రేంజ్ దాటేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక కేశవ విషయానికొస్తే ప్రస్తుతం బాహుబలి ఇంకా భారీ రేంజ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది.. సో బాహుబలి తర్వాత కాబట్టి ‘కేశవ’ విషయంలో కాస్త టెన్షన్ ఉంది. కానీ టీజర్ ట్రైలర్ సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి. అవి ఆడియన్స్ ను  రేపు థియేటర్స్ వరకూ తీసుకురావడానికి బాగా హెల్ప్ అవుతాయని భావిస్తున్నాం.

 

అన్ని థియేటర్స్ దొరికినందుకు హ్యాపీ

‘కేశవ’ రేపు దాదాపు 600 లకు పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు ఈ టైం లో అన్ని థియేటర్స్ దొరకడానికి సినిమా పై నెలకొన్న అంచనాలే కారణం.. చాలా హ్యాపీ గా ఫీలవుతున్నా..

 

ఒక్క సారిగా భయం వేసింది

లేటెస్ట్ గా ఓవర్సీస్ నుంచి ఒక వ్యక్తి మెస్సేజ్ పెట్టాడు.. ఆ మెస్సేజ్ లో మీ స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంటుంది. సో మీ మీద నమ్మకం తోనే ఈ సినిమాను కొంత భారీ అమౌంట్ పెట్టి ఒక ఏరియాకి తీసుకున్నా అని పెట్టాడు.. ఆ మెసేజ్ చూసి కొంచెం భయం వేసింది. కానీ ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది. కేశవ కచ్చితంగా మంచి హిట్ సాధించి అందరిని సేఫ్ జోన్ లో నిలబడుతుందని భావిస్తున్నా ..

 

ఇప్పుడే వాటి జోలికి వెళ్ళను

వరుసగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చేస్తున్నారని అందరు అడుగుతున్నారు.. నిజానికి నేను కావాలని ఆ స్టోరీస్ సెలెక్ట్ చేసుకోవట్లేదు. అవి అలా వచ్చేస్తున్నాయంతే . ఒక 5,6 ఏళ్ళు ఫుల్లెన్త్ సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలు చేయకూడదని డిసైడ్ అయిపోయా..

 

అప్పుడే అన్నేళ్లు గడిచాయా…

ఈ ఏడాదితో నటుడిగా 10 ఏళ్ళు పూర్తిచేసుకోబోతున్నా.. అక్టోబర్ తో హ్యాపీడేస్ విడుదలై 10 ఏళ్ళు అవుతుంది. సో హ్యాపీ డేస్ నుంచి ఈ స్థాయికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. అప్పుడే అన్నేళ్లు గడిచాయా..? అనిపిస్తుంది. త్వరలోనే హ్యాపీడేస్ గ్యాంగ్ అందరం కలిసి గ్రాండ్ గా 10 ఇయర్స్ సెలెబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నాం.

తమన్నాతో త్వరలోనే నటిస్తా

హ్యాపీడేస్ తర్వాత తమన్నా నేను కలిసి ఓ సినిమా చేయాలనుకున్నాం..కానీ కుదరలేదు. మేం ఎప్పుడు టచ్ లోనే ఉంటాం. తమన్నా నాకు మంచి ఫ్రెండ్.. త్వరలోనే తమన్నా తో కలిసి ఓ సినిమా చేస్తా మే బి అది ఈ ఏడాదే అవ్వొచ్చు..

 

ప్రస్తుతానికి ఆ మూడు సినిమాలు

కేశవ రిలీజ్ అవుతుంది. ఇక నా  ఫోకస్ అంతా  నెక్స్ట్ సినిమాల పై పెట్టబోతున్నా.. ఇప్పటికే ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ సినిమాతో పాటు ‘కనితన్’ అనే తమిళ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నా.. కిరిక్ పార్టీ సినిమాకు రాజు సుందరం మాస్టర్ దర్శకత్వం  వహిస్తారు. ఈ రెండు సినిమాలతో పాటు చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ’ కి సీక్వెల్ చేయబోతున్నా..

 

పెళ్లి త్వరలోనే

పెళ్ళెప్పుడు అని చాలా మంది అడుగుతున్నారు. ప్రెజెంట్ వరుసగా సినిమాలు చేస్తూ వాటి సక్సెస్ తో ఎంజాయ్ చేస్తున్నా.. ఈ ఇయర్ చేసుకోవాలనే ఉంది. చూద్దాం ఆ టైం వచ్చినప్పుడు. ఒక వేళ చేసుకుంటే మాత్రం లవ్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా…